Chandrababu: నన్ను అరెస్ట్ చేస్తారు: చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐటీ నోటీసుల నేపథ్యంలో రెండు రోజుల్లో తనను అరెస్ట్ చేసినా చేస్తారంటూ తెలిపారు. నిప్పులా బతికిన తనపైనే తప్పుడు కేసులు పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Chandrababu: నన్ను అరెస్ట్ చేస్తారు: చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
New Update

టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐటీ నోటీసుల నేపథ్యంలో రెండు రోజుల్లో తనను అరెస్ట్ చేసినా చేస్తారంటూ తెలిపారు. నిప్పులా బతికిన తనపైనే తప్పుడు కేసులు పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో పల్లె ప్రగతి కోసం ప్రజావేదిక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు ఏం అన్నారంటే..

► రేపో, ఎల్లుండో నన్ను అరెస్ట్ చేస్తారు
► నాపై దాడులు కూడా చేస్తారు
► నాపై తప్పుడు కేసులు పెడుతున్నారు
► 45ఏళ్లు నిప్పులా బతికా.. నేను ఏ తప్పూ చేయలేదు
► మా వాళ్లపై రౌడీలతో దాడులు చేస్తున్నారు
►వైసీపీ పాలనలో ఒక్క అభివృద్ధి పని అయినా చేశారా?
► ప్రతిపక్షాలు బయటకురాకుండా చూస్తున్నారు
► జగన్ ఎన్ని అరాచాకాలు చేసినా.. వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు
► విజయం ధర్మానిదే, జగన్‌కు జనం బుద్ధి చెబుతారు
► మహాభారతం, రామాయణంలో ధర్మం గెలిచినట్టు చివరకు మనమే గెలుస్తాం
► జగన్.. సైకో మాత్రమే కాదు.. కరడుగట్టిన సైకో
►అంగళ్లు, పుంగనూరులో వైసీపీ నాయకులు నాపై హత్యాయత్నానికి పాల్పడ్డారు
►నేను చెబితేనే దాడులు చేసినట్లు ఒత్తిడి చేస్తూ స్టేట్మెంట్ రాయిస్తున్నారు
►హత్యాయత్నం చేసి తిరిగి తనపైనే కేసులు పెట్టారు

చంద్రబాబుకు ఐటీ నోటీసులు..

ఇన్‌ఫ్రా కంపెనీల సబ్ కాంట్రాక్టుల ద్వారా రూ రూ.118 కోట్లు ముడుపులు తీసుకున్నారనే అభియోగాల కింద చంద్రబాబుకు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసినట్లు హిందూస్థాన్ టైమ్స్ జాతీయ దినపత్రిక తెలిపిన సంగతి తెలిసిందే. షోకాజ్ నోటీసులపై చంద్రబాబు అభ్యంతరాలను ఐటీ శాఖ తిరస్కరించినట్లు ఆ కథనంలో పేర్కొన్నారు. బోగస్ కాంట్రాక్టులు, వర్క్ ఆర్డర్ల ద్వారా నగదు స్వాహా చేసినట్లు మనోజ్ వాసుదేవ్ ఒప్పుకున్నారని ఆ ఆర్టికల్‌లో వివరించారు. చంద్రబాబు అభ్యంతరాలను తిరస్కరించిన తర్వాత.. ఆగష్టు 4వ తేదీనే హైదరాబాద్‌ ఐటీ సెంట్రల్‌ సర్కిల్‌ కార్యాలయం సెక్షన్ 153C కింద ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. 2019లో ఐటీ శాఖ అధికారులు చంద్రబాబు పీఏగా శ్రీనివాస్ నివాసంలో సోదాలు నిర్వహించినట్లు తెలిపారు.

వైసీపీ నేతల విమర్శలు..

చంద్రబాబుకు ఐటీ అధికారులు నోటీసులు జారీచేశారనే వార్తల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు చంద్రబాబును టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: ఐటీ నోటీసుల వార్త నిజమా? కాదా? చంద్రబాబుపై వైసీపీ నేతలు ఫైర్

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe