ChandraBabu: పవన్ కళ్యాణ్‌పై ప్రభుత్వం కేసు పెట్టడం నీతిమాలిన చర్య

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై ప్రభుత్వం పరువు నష్టం కేసు దాఖలు చేయడం నీతిమాలిన చర్య అని టీడీపీ చీఫ్ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అంటే జవాబుదారీగా ఉండాలి... అణచివేత ధోరణి మానుకోవాలని హెచ్చరించారు. ప్రజలు సమస్యలను ప్రస్తావిస్తే దాడులు..రాజకీయ పక్షాలు ప్రశ్నిస్తే కేసులు పెడుతూ వికృతానందం పొందుతున్నారని మండిపడ్డారు.

New Update
ChandraBabu: పవన్ కళ్యాణ్‌పై ప్రభుత్వం కేసు పెట్టడం నీతిమాలిన చర్య

publive-image

అణచివేత ధోరణి మానుకోవాలి..

వైసీపీ ప్రభుత్వం తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) తీవ్ర విమర్శలు చేశారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌(Pawankalyan)పై ప్రభుత్వం కేసు పెట్టడం బుద్దిలేని, నీతిమాలిన చర్య అని వ్యాఖ్యానించారు. తప్పులు చేస్తున్న తప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కూడా నేరం అనే పరిస్థితి రాష్ట్రంలో నెలకొందన్నారు.ప్రజలు తమ సమస్యలను ప్రస్తావిస్తే దాడులు...రాజకీయ పక్షాలు ప్రశ్నిస్తే కేసులు అనేది ఈ రాక్షస ప్రభుత్వ విధానం అయ్యిందన్నారు. ప్రభుత్వం అంటే జవాబుదారీగా ఉండాలి... ఈ అణచివేత ధోరణి మానుకోవాలని హెచ్చరించారు.

ప్రశ్నిస్తే కేసులు పెడతరా?

నిబంధనలకు వ్యతిరేకంగా ప్రజల వ్యక్తిగత వివరాలను వాలంటీర్ల ద్వారా సేకరించడాన్ని పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తే కేసు పెడతారా? అని నిలదీశారు. ప్రజల వ్యక్తిగత వివరాలు...కుటుంబ వ్యవహారాలపై ప్రభుత్వం సమాచారం సేకరించడమే తప్పు అని మండిపడ్డారు. పైగా దాన్నియోగం చేయడం నీచాతినీచం.. కేసు పెట్టాల్సి వస్తే ప్రభుత్వ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్న సీఎం జగన్‌(Jagan)పై ముందు కేసు పెట్టి విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

పరువు గురించి మాట్లాడటం పెద్ద జోక్..

ఈ ప్రభుత్వం పరువు గురించి మాట్లాడడమే పెద్ద జోక్ అని ఎద్దేవాచేశారు. నాలుగేళ్ల మీ దిక్కుమాలిన పాలనలో రాష్ట్ర పరువు, ప్రతిష్ట ఎప్పుడో మంటగలిశాయన్నారు. రోజులో 24 గంటలూ ప్రజల గొంతు ఎలా నొక్కాలి అనే అరాచకపు ఆలోచనలు పక్కన పెట్టి... రాష్ట్రంలో ఉన్న సమస్యలపై దృష్టి పెట్టండని సూచించారు. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు, వ్యక్తిగత దాడి.. మీ ప్రభుత్వ పాపాలను దాచిపెట్టలేవన్నారు. ప్రభుత్వానికి ధైర్యం ఉంటే సమాధానం చెప్పాలి అని సవాల్ విసిరారు.

నోటీసులపై స్పందించిన పవన్..

రాష్ట్రంలో వాలంటీర్ల(Volunteer)ను ఉద్దేశిస్తూ పవన్ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై పరువు నష్టం కేసుకు ప్రభుత్వం అనుమతించిన సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్‌పై పరువునష్టం కేసులు పెట్టాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్లను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి ప్రభుత్వం నోటీసులు పంపింది. ఈ నోటీసులపై జనసేనాని తనదైన శైలిలో స్పందించారు. తనను ప్రాసిక్యూషన్ చేయాలని ప్రభుత్వం జీవో ఇచ్చిందని.. నిర్మొహమాటంగా చేసుకోవచ్చని స్పష్టం చేశారు.వాలంటీర్లకు అధిపతి ఎవరని పవన్ ప్రశ్నించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు