YS Jagan : ఎన్నికల ప్రచారం(Election Campaign)లో భాగంగా చివరిరోజు ప్రచారంలో ఒంగోలు(Ongole)కి వచ్చానని.. ప్రజలంతా ఆశీర్వదించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) అన్నారు. 2024 ఎన్నికలకు అందరూ సిద్దమా అంటూ ఆయన ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో అభివృద్ధి జరిగిందా... బతుకులు బాగుపడ్డాయా? అంటూ చంద్రబాబు ప్రజలను ప్రశ్నించారు.
ఎన్నికల ముందు వచ్చిన జగన్ అనే మాయగాడ్ని ..నమ్మోద్దని చంద్రబాబు పిలుపునిచ్చారు. నా జీవితంలో ఇంత అరచాకపాలన నేను చూడలేదని బాబు పేర్కొన్నారు. ఎవరైనా అధికారంలోకి వస్తే అభివృద్ధి ఆకాంక్షిస్తారు... YS జగన్ సైకోలా ప్రవర్తించి కట్టడాలను కూల్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత 5 సంవత్సరాల పాలనలో 8 సార్లు కరెంట్ చార్జీలు పెంచిన ఘనత జగన్మోహన్ రెడ్డి దని బాబు అన్నారు. రాష్ట్రంలో ఒక్కరికీ కూడా శాంతి..సమాధానం లేకుండా చేస్తున్నాడు ఈ సైకో... రాష్ట్రాన్ని కొల్లగొట్టడానికి కంకణం కట్టుకున్నాడని విరుచుకుపడ్డారు.మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి.. మాట తప్పిన ఘనత YCP ప్రభుత్వానిదని ఎద్దేవా చేశారు.
అసమర్థ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే..అక్రమకేసులు పెట్టడం ఈ ప్రభుత్వానికి ఆనవాయితీగా మారిందని చంద్రబాబు అన్నారు. ఉద్యోగస్తులు పోస్టల్ బ్యాలెట్ తో తమ సత్తా చూపారు... రేపు మీరుకూడా మీ ఓటుతో YCP ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. రాష్ట్రం అభివృద్ధి జరగాలి అన్నా .. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగాలన్నా, సంక్షేమ ఫలాలు రావాలిఅంటే TDP అధికారంలోకి రావాలని బాబు అన్నారు.
ప్రజలతో YCP పాలనపై తిరుగుబాటు మొదలు అయ్యిందన్నారు. రేపు జరగబోయే ఎన్నికలు రాజకీయాలు కోసం కాదు.. రాష్ట్ర భవిష్యత్ కోసమే అని తెలిపారు. TDP మ్యానిఫెస్టోలో చెప్పిన విధంగా , సూపర్ సిక్స్ అమలు చేసే బాధ్యత TDP ప్రభుత్వానిదే అని అన్నారు.
తెలుగు తమ్ముళ్లు... జనసైనికులు వీరోచితంగా పోరాడుతున్నారని అన్నారు.హైదరాబాద్ అభివృద్ధిలో నా ప్రమేయం ఉందా.. లేదా? అంటూ ప్రశ్నించారు.
నా అక్రమ అరెస్టు కి నిరసనంగా ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగు వాడు నిరసన తెలిపారు. కొందరి స్వార్థం వలన ఇప్పుడూ రాష్ట్రం దిక్కు లేనిది అయిపోయిందని బాబూ విచారం వ్యక్తం చేశారు.
Also read: సీఎం రేవంత్‌పై జగన్ సంచలన వ్యాఖ్యలు