Chandrababu: టీడీపీకు మరో గుడ్‌ న్యూస్‌.. మరో కేసులో చంద్రబాబుకు ఊరట!

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. 53 రోజులుగా జైల్లో ఉన్న చంద్రబాబుకు బెయిల్ రావడంతో టీడీపీ శ్రేణులు ఆనందాల్లో మునిగిపోగా.. ఇదే సమయంలో వారికి మరో గుడ్‌న్యూస్‌ తెలిసింది. స్కిల్ స్కామ్‌ కేసులో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ పూర్తయ్యే వరకు మద్యం కేసులో అరెస్ట్ చేయబోమని హైకోర్టుకు ఏజీ తెలిపారు.

TDP : టీడీపీకి భారీ షాక్.. 400 మంది రాజీనామా..!
New Update

చంద్రబాబుకు మరో బిగ్‌ రిలీఫ్‌ ఇది. మద్యం కేసులో చంద్రబాబుకు ఊరట లభించింది. చంద్రబాబును మద్యం కేసులో అరెస్ట్ చేయబోమని అడ్వొకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. స్కిల్ స్కామ్‌ కేసులో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ పూర్తయ్యే వరకు అరెస్ట్ చేయబోమని చెప్పారు. తదుపరి విచారణ నవంబర్ 21వ తేదీకి వాయిదా వేశారు. మరోవైపు, మద్యం కేసులో వచ్చే నెల 15న కౌంటర్ దాఖలు చేస్తామని హైకోర్టుకు ఏజీ తెలిపారు.

టీడీపీకి మంచి రోజులు వచ్చాయా?

నిన్నటివరకు చంద్రబాబు అభిమానులు, టీడీపీ కార్యకర్తలు చాలా నిరాశతో ఉన్నారు.. చంద్రబాబుకు బెయిల్ ఎప్పుడు వస్తుందా.. ఆయన బయటకు ఎప్పుడు వస్తారా అని ఎదురుచూశారు. ఇవాళ(అక్టోబర్ 31) చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ఇస్తూ తీర్పునివ్వడంతో టీడీపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. తాజాగా మద్యం కేసులోనూ చంద్రబాబుకు ఊరట లభించడంతో ఇక తమకు అంతా మంచే జరుగుతుందని టీడీపీ కార్యకర్తలు భావిస్తున్నారు. ఇప్పటివరకు ఒక లెక్క.. ఇప్పటినుంచి మరో లెక్క అంటున్నారు. స్కిల్‌ స్కామ్‌ కేసులో చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో పెట్టారు. రిమాండ్‌ ఖైదీగా ఆయన అక్కడ ఉన్నారు.

మరోవైపు చంద్రబాబుకు ఇచ్చింది షరతులతో కూడిన బెయిలే. కేవలం ఆరోగ్య కారణాల దృష్ట్యా బెయిల్‌ మంజూరు చేస్తున్నట్లు కోర్టు స్పష్టం చేసింది. నవంబర్‌ 24న బాబు తిరిగి సరెండర్ కావాలని ఆదేశించింది. దీంతో పాటు బెయిల్ మీద బయటకు వెళ్లాక ఆస్పత్రికి వెళ్లడం మినహా మరే ఇతర కార్యక్రమాల్లో పాల్గొన కూడదని స్పష్టం చేసింది. ఫోన్‌లో కూడా మాట్లాడకూడదంటూ ఆదేశాల్లో పేర్కొంది న్యాయస్థానం. అలాగే మీడియా, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. నవంబర్ 10న మెయిన్ బెయిల్ పిటిషన్‌పై వాదనలు వింటామని ఈ సందర్భంగా హైకోర్టు తెలిపింది.

Also Read: కేటీఆర్, రేవంత్ రెడ్డి ఫోన్లు హ్యాక్?.. యాపిల్ నుంచి అలర్ట్ మెసేజ్!

#chandrababu-arrest
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe