/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Chandrababu-Naidu-4-jpg.webp)
Chandrababu Naidu off to Hyderabad: స్కిల్ స్కామ్ కేసులో బెయిల్‌పై విడుదలైన చంద్రబాబు నాయుడు.. విజయవాడ నుంచి నేరుగా హైదరాబాద్‌కు బయలుదేరనున్నారు. గత 52 రోజులు జైల్లో ఉండటంతో చంద్రబాబు ఆరోగ్యం బాగోలేదని తెలుస్తోంది. దాంతో ఆయన వైద్య పరీక్షలు చేయించుకోనున్నారు. కోర్టు ఆదేశాలకు మేరకు చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌కు బయలుదేరుతున్నారు. ఇదే విషయాన్ని తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వెల్లడించారు. చంద్రబాబు హైదరాబాద్ షెడ్యూల్‌కు సంబంధించిన వివరాలు పేర్కొంటూ అచ్చెన్నాయుడు ఒక ప్రకటన విడుదల చేశారు.
'కోర్టు ఆదేశాలతో చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరీక్షల నిమిత్తం హైదరాబాద్ వెళ్తున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు ఎవరినీ ఆయన కలవరు.' అని ప్రకటనలో స్పష్టం చేశారు అచ్చెన్నాయుడు.
'చంద్రబాబు నాయుడుపై సీఎం జగన్ పెట్టిన అక్రమ కేసుల వల్ల 52 రోజుల పాటు జైల్లో ఉన్నా టీడీపీ నాయకులు, కార్యకర్తలు మనోధైర్యం కోల్పోలేదు. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ని నిరసిస్తూ వివిధ నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. నేడు మన నాయకునికి బెయిల్ రావటం మనతోపాటు రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలతో పాటు వివిద దేశాల్లోని తెలుగు పౌరులకు సంతోషకరం. ఇదే స్పూర్తి ముందు కూడా కొనసాగిద్దాం. కోర్టు ఆదేశాలతో చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరీక్షలు నిమిత్తం హైదరాబాద్ వెళ్తున్నారు. పార్టీ నేతలెవరినీ ఆయన కలవరు. కార్యకర్తలు, నాయకులు ఈ విషయం గమనించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.' అని అచ్చెన్నాయుడు ఒక ప్రకటన విడుదల చేశారు.
అడుగడుగునా పోలీసు ఆంక్షలను లెక్కచేయకుండా రాజమండ్రి సమీపంలోని వేమగిరి వద్ద జాతీయ రహదారిపైకి చేరుకున్న వేలాది అభిమానులు. కనీవినీ ఎరుగని రీతిలో చంద్రబాబునాయుడుకు పార్టీ శ్రేణులు, అభిమానులు, ప్రజల అపూర్వస్వాగతం.#NijamGelavali#SatyamevaJayate#CBNSatyamevaJayatepic.twitter.com/Qfgvg0pyjY
— Telugu Desam Party (@JaiTDP) October 31, 2023
Also Read:
శరీరంలో గాయం మచ్చ పోవట్లేదా? జస్ట్ ఇలా చేస్తే చాలు మరక మాయం..!
ఈ రాశుల వారు వారం రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి.. లేదంటే కష్టాలు తప్పవు..!