Andhra Pradesh: హైదరాబాద్కు చంద్రబాబు.. కారణం వెల్లడించిన అచ్చెన్నాయుడు..
రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలైన చంద్రబాబు నాయుడు.. వైద్య పరీక్షల కోసం హైదరాబాద్ వెళ్లనున్నారు. రాజమండ్రి నుంచి నేరుగా విజయవాడ వెళ్లిన ఆయన.. అక్కడి నుంచి హైదరాబాద్ బయలుదేరుతారు. ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వెల్లడించారు. కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబును నాయుడు ఆరోగ్య పరీక్షల నిమిత్తం హైదరాబాద్ వెళ్తున్నారని, నాయకులు, పార్టీ కార్యకర్తలు ఎవరినీ ఆయన కలవబోరని స్పష్టం చేశారు.