Chandrababu Naidu: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టై జ్యూడీషియల్ రిమాండ్‌లో టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(Chandrababu) నాయుడు జైలులో అస్వస్థతకు గురయ్యారు. ఆయన నీరసంగా ఉన్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు డీహైడ్రేషన్‌కు గురైనట్లు తెలుస్తోంది. అక్కడి వాతావరణ పరిస్థితులు, జైలులో గాలి లేకపోవడం కారణంగా చంద్రబాబు ఉక్కపోతకు గురయ్యారు. తాను డీహైడ్రేషన్ సమస్యతో బాధపడుతున్నట్లు జైలు అధికారులకు, వైద్యాధికారులకు తెలియజేశారు చంద్రబాబు. దాంతో వైద్యులు ఆయనకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తున్నారు. కాగా, జైలులో సౌకర్యాల విషయమై.. తన కుటుంబ సభ్యులకు కూడా తెలియజేశారని, వారు చంద్రబాబు ఆరోగ్యంపై ఆందోళన చేస్తున్నారు. పోలీసులు, వైద్యాధికారులు మాత్రం సమస్య ఏమీ లేదని, అవసరైన చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నారు.
ఎటూ తేలని కేసులు..
స్కెల్ డెవలప్‌మెంట్ స్కామ్ సహా ఇతర కేసులు ఎదుర్కొంటున్న చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో జ్యూడిషియల్ కస్టడీలో ఉన్నారు. దాదాపు నెల రోజులుగా ఆయన జైల్లోనే ఉన్నారు. బెయిల్ కోసం, తనపై నమోదైన కేసుల నుంచి విముక్తి కోసం ఏసీబీ కోర్టు, హైకోర్టు, సుప్రీం కోర్టును సైతం ఆశ్రయించినా ఫలితం లేకుండా పోతోంది. దాంతో ఆయన జైలుకే పరిమితం అవ్వాల్సి వస్తోంది.
Also Read:
TS elections 2023: బాబోయ్.. ఎన్నికల వేళ రోడ్లపైకి నోట్ల కట్టలు.. ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు..!