/rtv/media/post_attachments/wp-content/uploads/2023/05/jagan-sarkar-conspiracy-to-creat-conflicts-chandrababu.jpg)
భారీ విజయం తర్వాత చంద్రబాబు నాయిడు ఈ రోజు సాయంత్రం ప్రెస్ తో మాట్లాడుతారని అంతా భావించారు. అయితే.. ఆయన ఈ రోజు మీడియా సమావేశంలో పాల్గొనే అవకాశం లేదని తెలుస్తోంది. రేపు ఎన్డీఏ కూటమి పక్షాలతో సమావేశం కోసం చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీలోనే ఆయన ప్రెస్ తో మాట్లాడే అవకాశం ఉందని టీడీపీ వర్గాల నుంచి తెలుస్తోంది. చంద్రబాబు నివాసానికి భారీగా నేతలు, కార్యకర్తలు తరలిరావడంతో సందడిగా మారింది. ఇప్పటికే పవన్ కల్యాణ్ చంద్రబాబుతో భేటీ అయ్యారు. రాత్రిలోగా ఆయన మరికొంత మంది ముఖ్య నేతలతో ఆయన భేటీ అయ్యే అవకాశం ఉంది. ప్రమాణస్వీకారం, ప్రభుత్వ ఏర్పాటుపై ఆ నేతలతో చంద్రబాబు చర్చించనున్నారు.