Chandrababu in Jail Day 17: చంద్రబాబుకు షాక్.. కస్టడీ, బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా?

నేడు ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లకు సంబంధించిన విచారణ వాయిదా పడే అవకాశం ఉంది. ఏసీబీ కోర్టు న్యాయమూర్తి సెలవుపై వెళ్లడంతో ఈ విచారణ రేపు జరిగే అవకాశం ఉందని సమాచారం. 

Chandrababu in Jail Day 17: చంద్రబాబుకు షాక్.. కస్టడీ, బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా?
New Update

Chandrababu in Jail Day 17: స్కిల్ డవలప్మెంట్ కేసులో (AP Skill Development Case) అరెస్ట్ అయిన ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడుకు సంబంధించిన పలు పిటిషన్లపై నేడు హైకోర్టులో (AP High Court) విచారణ జరగనుంది. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ (Inner Ring Road Case) అక్రమాల వ్యవహారంలో నమోదు అయిన కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై నేడు హైకోర్టు విచారించనుంది. దీంతో పాటు అంగల్లు అల్లర్ల కేసులో నమోదైన కేసులోనూ చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా నేడు ఏపీ హైకోర్టులో విచారణకు రానుంది.

ఇది కూడా చదవండి: Chandrababu: జైల్లో చంద్రబాబును చూసి భువనేశ్వరి కంటతడి

ఇంకా.. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసుకు సంబంధించిన బెయిల్ పిటిషన్, కస్టడి పిటిషన్ పై ఏసీబీ కోర్టు (ACB Court) నేడు విచారణ జరపనుంది. సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ పై చంద్రబాబు తరఫు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేయనున్నారు. అయితే.. చంద్రబాబు కస్టడీ నివేదికను ఇప్పటికే సీల్డ్ కవర్లో సీఐడీ అధికారులు కోర్టుకు అందచేశారు. చంద్రబాబును మరో ఐదు రోజులు పాటు తమ కస్టడీకి ఇవ్వాలంటూ నిన్న సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. బెయిల్ పిటిషన్, కస్టడీ పిటిషన్లపై వాదనలు విన్న తర్వాత ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తీర్పు ఇవ్వనున్నారు.

అయితే.. నేడు ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లకు సంబంధించిన విచారణ వాయిదా పడే అవకాశం ఉంది. ఏసీబీ కోర్టు న్యాయమూర్తి సెలవుపై వెళ్లడంతో ఈ విచారణ రేపు జరిగే అవకాశం ఉందని సమాచారం. ఏసీబీ కోర్టు ఇంచార్జి న్యాయమూర్తిగా సత్యానందం వ్యవహరించనున్నారు.

సుప్రీంకోర్టులో కూడా నేడు చంద్రబాబు కేసు ప్రస్తావనకు రానుంది. చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్లను కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు తరఫు లాయర్లు సుప్రీంకోర్టులో పిటిషన్ (SLP-Special leave Petition) దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై అత్యవసర విచారణ చేపట్టాలని చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ఎదుట సోమవారం ప్రస్తావించారు. దీంతో ఈ పిటిషన్ ప్రస్తావనల జాబితాలో లేదని.. మంగళవారం నాడు జాబితాలో చేర్పించి ప్రస్తావించాలని సూచించారు.

#ap-skill-development-case #chandrababu-arrest
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe