మార్నింగ్ యోగా, వాకింగ్ చేసిన చంద్రబాబు...నేడు లోకేశ్, బ్రహ్మణి కలిసే ఛాన్స్..!!

తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేడు రాజమండ్రి సెంట్రల్ జైలులో వాకింగ్, యోగా చేసినట్లు జైలు సిబ్బంది తెలిాపరు. చంద్రబాబుతో ఈరోజు ఆయను కుటుంబ సభ్యులు ములాఖత్ కానున్నారు.

IRR Case: ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్!
New Update

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ ఉదయం రాజమండ్రి సెంట్రల్ జైలులో వాకింగ్, యోగా చేసినట్లు జైలు అధికారులు తెలిపారు. రాజమండ్రి సెంట్రల్ జైలులోని స్నేహ బ్లాక్ ఉన్న ఆయన వాకింగ్, యోగా చేసినట్లు సమాచారం. సోమవారం రాత్రి చంద్రబాబు త్వరగా నిద్రపోయారని తెలిపారు. చంద్రబాబుకు ఆయన సహాయకుడు బ్రేక్ ఫాస్ట్ అందించనున్నాడు.

కాగా నేడు కుటుంబం సభ్యులతో చంద్రబాబు ములాఖత్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. సోమవారం రోజే నారాలోకేష్, బ్రహ్మణి, ఆయన సతీమణి భువనేశ్వరి బాబును కలవాల్సి ఉంది. కానీ సోమవారం రోజు చంద్రబాబుతో వారి ములాఖత్ జరగలేదు. ఈరోజు ఈ ముగ్గురు బాబును కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక చంద్రబాబు జైలుకు వెళ్లినప్పటి నుంచి నారాలోకేశ్ రాజమండ్రిలోనే ఉన్నారు.

ఇది కూడా చదవండి: చంద్రబాబు అరెస్ట్‌.. టీడీపీ లీగల్‌సెల్‌ ఐదు ఫెయిల్యూర్స్‌ ఇవే..!

చంద్రబాబు హౌస్ రిమాండ్ మీద నేడు మధ్యాహ్నం తీర్పు వెలువడనుంది. దీనికి సంబంధించిన వాదనలు నిన్ననే ముగిశాయి. కాగా జైలులో ఉన్న స్నేహ బ్లాక్ లో చంద్రబాబుకు ప్రత్యేక గదిని కేటాయించిన సంగతి తెలిసిందే. ఆయను సహాయంగా ఓవ్యక్తిని నియమించారు. ఐదుగురు సిబ్బందితో భద్రతను కల్పించారు. సోమవారం ములాఖత్ లు లేవు. కుమారుడు నారాలోకేశ్, భార్య భువనేశ్వరి, కోడలు బ్రహ్మణిలను బాబును కలిసేందుకు అనుమతించే అవకాశాలు ఉన్నాయి. అల్పాహారాన్ని ఇంటి భోజనాన్ని , మందులను సహాయకుడు బాబుకు అందిస్తారు.

ఇది కూడా చదవండి: రెండు రోజులు కుమ్ముడే.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు!

కాగా చంద్రబాబు హౌస్‌ అరెస్ట్‌పై వాదనలు నేడు వాదనలు జరగనున్నాయి. నేడు (సెప్టెంబర్ 12) ఏసీబీ కోర్టు మరోసారి వాదనలు విననుంది. సుదీర్ఘంగా జరిగిన వాదనలు సోమవారం ముగిశాయి. మూడు దఫాలుగా వాదనలు సాగాయి. చంద్రబాబు తరపున లూథ్రా వాదనలు వినిపించగా.. సీఐడీ తరపున పొన్నవోలు వాదనలు వినిపించారు. హాని ఉంది వెసులుబాటు కల్పించాలని లూథ్రా వాదించారు. NSG సెక్యూరిటీ ఉందని హౌస్‌ అరెస్ట్ అడుగుతున్నామని లూథ్రా చెప్పారు. అయితే రాజమండ్రి జైలే చంద్రబాబుకు సేఫ్టీ అని పొన్నవోలు వాదించారు. హౌస్‌ కస్టడీ ఇవ్వాల్సిన అవసరం లేదని సీఐడీ నొక్కి చెప్పింది. ఇంటికంటే జైలే సేఫ్టీ అని సీఐడీ న్యాయవాదులు కోర్టుకు చెప్పారు. చంద్రబాబు బయటకు వెళ్తే కేసును ప్రభావితం చేసే ఛాన్స్ ఉందని సీఐడీ వాదించింది.

#skill-development-case #acb-court #chandrababu-arrest #chandrababu-remanded
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe