Chandrababu: ఫార్మా కంపెనీలో ప్రమాదంపై ఉన్నత స్థాయి కమిటీ: సీఎం కీలక ప్రకటన

విశాఖ ఫార్మా కంపెనీలో ఎస్ఓపీ పాటించకపోవడంతోనే ప్రమాదం జరిగిందని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ప్రమాదానికి జరగడానికి గల కారణాలను తెలుసుకోవడానికి ఉన్నత స్థాయి కమిటీ వేస్తున్నట్లు చెప్పారు. కమిటీ రిపోర్ట్ ప్రకారం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

New Update
CM Chandrababu: విభజన వల్ల ఏపీకి భారీ నష్టం జరిగింది.. దానిపై ఇంకా క్లారిటీ లేదు!

CM Chandrababu: విశాఖ ఫార్మా కంపెనీలో ఎస్‌వోపి సరిగ్గా పాటించకపోవడం వల్లే ప్రమాదం జరిగిందన్నారు సీఎం చంద్రబాబు. పరిశ్రమలో పేపర్ క్లౌడ్ పేలుడు జరిగిందన్నారు. చనిపోయిన వారికి రూ. కోటి ఆర్థిక సాయం, తీవ్ర గాయాల పాలైన వారికి రూ. 50 లక్షలు, స్వల్ప గాయాలైన వారికి రూ. 25 లక్షల పరిహారం అందిస్తున్నామన్నారు. 2019-24 మధ్య 119 ప్రమాదాలు జరిగాయని.. ఐదేళ్లలో మొత్తం 120 మంది చనిపోయారని తెలిపారు. కంపెనీ జాగ్రత్తలు తీసుకోకపోతే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయన్నారు.

Also Read: కన్నీరు పెట్టిస్తోన్న హారిక కథ.. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి..!

భద్రతకు పరిశ్రమ యజమాన్యాలు ప్రాధాన్యత ఇవ్వాలని.. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తప్పవని చంద్రబాబు హెచ్చరించారు. ఎసెన్షియా రెడ్ కేటగిరిలో ఉన్న కంపెనీ అని తెలిపారు. పరిశ్రమ యాజమాన్యంలోనూ అంతర్గత సమస్యలు ఉన్నాయన్నారు. పరిశ్రమల అనుబంధ శాఖలన్నీ ఉమ్మడిగా పనిచేయాలని.. అన్ని శాఖలు ఒకేసారి పరిశ్రమలను తనిఖీలు చేయాలని ఆదేశించారు. జరిగిన ఘటనపై ఉన్నతస్థాయి విచారణ కమిటీ ఏర్పాటు చేసి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Advertisment
తాజా కథనాలు