స్కిల్ డవలప్మెంట్ కేసులో (Skill Development Corporation scam) అరెస్ట్ అయిన ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడును (AP Ex CM Chandrababu Naidu) రెండు రోజుల సీఐడీ కస్టడీ విచారణకు కోర్టు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. నిన్న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చంద్రబాబుని సీఐడీ అధికారులు విచారించారు. పలు ఫైళ్లను ఆయన ముందు ఉంచి ప్రశ్నల వర్షం కురిపించారు. నేడు చంద్రబాబు రెండో రోజు ప్రారంభమైంది. నిన్న పలు ప్రశ్నలకు చంద్రబాబు చెప్పిన సమాధానాల ఆధారంగా నేడు చంద్రబాబును ప్రశ్నించడానికి సీఐడీ అధికారులు సిద్ధమయ్యారు. స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటులో ఎలాంటి అవినీతి జరగలేదని తొలి రోజు జరిగిన విచారణలో చంద్రబాబు సీఐడీ అధికారులకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఘంటా సుబ్బారావు, కే.లక్ష్మీనారాయణకు సంస్థలో కీలక బాధ్యతలు అప్పగించడంపై సైతం సీఐడీ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఘంటా సుబ్బారావు ప్రపంచంలోనే గుర్తింపు పొందిన సాఫ్ట్ వేరు నిపుణుడైన కారణంగా ఆయనను నియమించే అవకాశంపై పరిశీలించాలని అధికారులకు సూచించామని చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది. అనంతరం ఆయన నియామకం నిబంధనల ప్రకారమే జరిగిందని చంద్రబాబు వివరిచినట్లు సమాచారం.
ఇంకా లక్ష్మీనారాయణ గతంలో ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా పని చేశారని.. ఆయన అనుభవాన్ని వినియోగించుకోవాలన్న ఆలోచనతోనే ఆయన నియామకం జరిగిందని చంద్రబాబు వివరించినట్లు తెలుస్తోంది. యువతకు సాధ్యమైనన్ని ఎక్కువ ఉద్యోగాలను సృష్టించాలన్న లక్ష్యంతోనే స్కిల్ డవలప్మెంట్ సంస్థను తమ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని చంద్రబాబు సీఐడీ అధికారుల ప్రశ్నలకు సమాధానంగా చెప్పినట్లు సమాచారం. కొన్ని ప్రశ్నలకు తెలియదు అని చంద్రబాబు సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది.|
ఈ నేపథ్యంలో.. ఈ రోజు జరుగుతున్న విచారణలో మరికొన్ని కొత్త అంశాలకు సంబంధించి సైతం ప్రశ్నలను సీఐడీ సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అధికారులు చంద్రబాబును ప్రశ్నిస్తారు. అనంతరం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు లంచ్ బ్రేక్ ఉంటుంది. లంచ్ బ్రేక్ తర్వాత 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మళ్లీ చంద్రబాబును విచారించనుంది సీఐడీ. దాదాపు 60 ప్రశ్నలను సీఐడీ సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఈ రెండు రోజుల విచారణలో చంద్రబాబు సమాధానాలతో సీఐడీ సంతృప్తి చెందకపోయినా.. ఇంకా విచారించాల్సిన అవసరం ఉందని భావించినా.. చంద్రబాబును మరికొన్ని రోజులు కస్టడీకి ఇవ్వాలని సీఐడీ కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి:
MK Stalin: అవయవ దానం చేస్తే ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు