Chandrababu in Jail Day 16: చంద్రబాబు నాయుడు కేసుల అప్‌డేట్స్.. ఏ కోర్టులో ఏ కేసు విచారణ జరుగనుందంటే..

స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు.. మధ్యంతర బెయిల్, జనరల్ బెయిల్ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో నేడు విచారణ జరుగనుంది. అటు చంద్రబాబు తరఫున న్యాయవాదులు, ఇటు సీఐడీ తరఫున న్యాయవాదులు విచారించనున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డ కేసులో పిటి వారెంట్‌తో పాటు కస్టడీ పిటిషన్‌పైనా ఏసీబీ కోర్టులో ఇవాళ విచారణ జరుగనుంది. చంద్రబాబు కస్టడీపై పిటిషన్ దాఖలు చేయనున్నారు సీఐడీ తరఫున న్యాయవాదులు.

Chandrababu in Jail Day 16: చంద్రబాబు నాయుడు కేసుల అప్‌డేట్స్.. ఏ కోర్టులో ఏ కేసు విచారణ జరుగనుందంటే..
New Update

Chandrababu Arrest Updates: స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు(Chandrababu).. మధ్యంతర బెయిల్, జనరల్ బెయిల్ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో నేడు విచారణ జరుగనుంది. అటు చంద్రబాబు తరఫున న్యాయవాదులు, ఇటు సీఐడీ తరఫున న్యాయవాదులు విచారించనున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డ కేసులో పిటి వారెంట్‌తో పాటు కస్టడీ పిటిషన్‌పైనా ఏసీబీ కోర్టులో ఇవాళ విచారణ జరుగనుంది. చంద్రబాబు కస్టడీపై పిటిషన్ దాఖలు చేయనున్నారు సీఐడీ తరఫున న్యాయవాదులు. మరోవైపు ఏపీ ఫైబర్ నెట్ కేసుపైనా ఏసీబీ కోర్టులో పిటి వారెంట్ పిటిషన్ దాఖలు చేశారు సీఐడీ అధికారులు. దీనిపైనా కోర్టు విచారణ చేపట్టే అవకకాశం ఉంది.

మరోవైపు ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో ఇవాళ విచారణ జరుగునుంది. ఇక స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో హైకోర్టకు కొట్టేసిన స్క్వాష్ పిటిషన్‌పై సుప్రీంను ఆశ్రయించారు చంద్రబాబు లాయర్లు. ఆ క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరుగనుంది.

కాగా స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును 2 రోజుల పాటు విచారించింది సీఐడీ. దాదాపు 120 ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. విచారణకు సంబంధించిన నివేదికను సీల్డ్ కవర్‌లో సీఐడీ అధికారులకు కోర్టుకు సమర్పించారు. విచారణ అనంతరం చంద్రబాఆబు రిమాండ్‌ను అక్టోబర్ 5వ తేదీ వరకు పొడిగించింది ఏసీబీ కోర్టు. చంద్రబాబును నాయుడు అక్టోబర్ 5వ తేదీ వరకు రాజమండ్రి జైల్లోనే ఉండనున్నారు. వాస్తవానికి ఆదివారంతోనే సీఐడీ కస్టడీ, రిమాండ్ కూడా ముగిశాయి. కస్టడీ ముగిశాక వర్చువల్‌గా ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట చంద్రబాబును హాజరు పరిచారు పోలీసులు. కేసు విచారణ దశలో ఉన్నందున ఇప్పుడే అంతా అయిపోలేదని, బెయిల్ పిటిషన్‌పై సోమవారం విచారణ చేపడతామని న్యాయమూర్తి చెప్పారు. ఇక చంద్రబాబు బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేస్తారన్న సీఐడీ వాదనతో ఏకీభవించిన ఏసీబీ కోర్టు జడ్జి.. ఆయన రిమాండ్‌ను అక్టోబర్ 5వ తేదీ వరకు పొడిగించింది. కాగా, వరుస పిటిషన్లు వేస్తుండటంతో.. చంద్రబాబు తరఫున లాయర్లపై ఏసీబీ ఓర్టు న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేసిన్టుల వార్తలు వస్తున్నాయి.

చంద్రబాబుతో కుటుంబ సభ్యుల ములాఖత్..

స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో అరెస్టైన చంద్రబాబు రిమాండ్ నేటితో 16వ రోజుకు చేరుకుంది. అయితే, ఇవాళ సోమవారం నాడు కుటుంబ సభ్యులు చంద్రబాబుతో ములాఖత్‌ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇవాళ ఉదయం చంద్రబాబుతో ములాఖత్ కోసం జైళ్ల శాఖను అనుమతి కోరనున్నారు నారా భువనేశ్వరి.

నారా బ్రాహ్మణికి టీడీపీ పగ్గాలు..

ఇవి కూడా చదవండి:

కడియం శ్రీహరికి జైకొట్టిన రాజయ్య.. కేటీఆర్ సమక్షంలో సయోధ్య.. వివరాలివే!

చరణ్ ‘గేమ్‌ఛేంజర్’ మూవీ షూటింగ్ అందుకే క్యాన్సిల్ చేశాం

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe