Chandrababu Arrest: చంద్రబాబుకు బిగ్ షాక్ ఇచ్చిన హైకోర్ట్

ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న చంద్రబాబు స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో తీర్పునిచ్చింది. క్వాష్ పిటిషన్‌ను కొట్టేసింది. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబుపై నమోదు చేసిన కేసు రిమాండ్ రిపోర్టును క్వాష్ చేయాలని కోరుతూ ఆయన తరఫున న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

New Update
AP High Court: చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ వాయిదా

High Court Rejects Quash and Remand Review Petitions: ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న చంద్రబాబు(Chandrababu) స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో(High Court) తీర్పునిచ్చింది. క్వాష్ పిటిషన్‌ను కొట్టేసింది. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబుపై నమోదు చేసిన కేసు రిమాండ్ రిపోర్టును క్వాష్ చేయాలని కోరుతూ ఆయన తరఫున న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నాలుగు రోజుల క్రితమే చంద్రబాబు తరుపున న్యాయవాదులు లూథ్రా, హరీష్ సాల్వే తమ వాదనలు బలంగా వినిపించారు. సీఐడీ తరఫు న్యాయవాదులు కూడా గట్టిగానే వాదరించారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటలకు తీర్పును వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ హైకోర్టు తన తీర్పును వెల్లడించింది. క్వాష్ పిటిషన్‌ను తోసిపుచ్చింది. సీఐడీ వాదనలను సమర్థిస్తూ తీర్పునిచ్చింది కోర్టు.

చంద్రబాబు లాయర్స్ వాదనలు ఇలా..

ఎఫ్ఐఆర్‌లో చంద్రబాబు పేరు లేకపోవడమే కాకుండా.. గవర్నర్ అనుమతి కూడా తీసుకోలేదని, చట్ట విరుద్ధంగా చంద్రబాబును అరెస్ట్ చేయడం సరికాదని ఆయన తరఫున లాయర్స్ తమ వాదనలు వినిపించారు. రాజకీయ ఉద్దేశంతోనే ఆయనను అరెస్ట్ చేశారన్నారు. ఈ కేసులో చంద్రబాబు ప్రమేయం ఉన్నట్లుగా ఎక్కడా ఆధారాలు చూపలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇదే తరహా సెక్షన్ల కేసుల్లో హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులు, మార్గదర్శకాలను లాయర్స్ ప్రస్తావించారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని చంద్రబాబు కేసును క్వాష్ చేయాలని కోరారు.

సీఐడీ వాదనలు ఇలా..

అయితే, సీఐడీ తరఫున న్యాయవాదులు ముఖుల్ రోహిత్గీ, ఏఏజీ సుధాకర్ రెడ్డి గట్టి వాదనలే వినిపించారు. చంద్రబాబు లాయర్స్ వాదనలతో విభేదించారు. సెక్షన్ 319 ప్రకారం విచారణ సంస్థ ఎన్నిసార్లు అయినా ఛార్జ్ షీట్లు దాఖలు చేసే అవకాశం ఉంటుందని, ఎంత మందిని అయినా విచారించొచ్చని అన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు తీసుకున్న నిర్ణయం, ఒప్పందానికి అనుగుణంగా స్కిల్ డెవలప్‌మెంట్ పాలసీ జరుగలేదని కోర్టుకు వివరించారు న్యాయవాదులు. దురుద్దేశ్యంతోనే.. రూ. 371 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని అన్నారు. ఇక గవర్నర్‌కు సమాచారం ఇవ్వకపోడంపై వివరణ ఇచ్చిన సీఐడీ తరఫున న్యాయవాదులు.. ఆయన ఎమ్మెల్యే మాత్రమేనని, బాబు అరెస్ట్‌పై స్పీకర్‌కు సమాచారం ఇచ్చామని తెలిపారు.

కోర్టు తీర్పు ఇలా..

ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. చివరకు చంద్రబాబుకు షాక్ ఇచ్చింది. సీఐడీ వాదనలు సమర్థిస్తూ.. తీర్పునిచ్చింది. ఇదిలాఉంటే హైకోర్టు తీర్పుతో ఏసీబీ కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వనుందోననే ఉత్కంఠ మరింత పెరిగింది. ఇప్పటికే చంద్రబాబు రిమాండ్‌ను మరో రెండు రోజులు పెంచిన కోర్టు.. చంద్రబాబును సీఐడీ కస్టడీకి అప్పగిస్తారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.

Also Read:

Andhra Pradesh: చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై నేడు తీర్పు.. ఏసీబీ కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ..

Telangana: పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఇంటి స్థలాలు.. మరో పది రోజుల్లో పంపిణీ..

Advertisment
Advertisment
తాజా కథనాలు