Balakrishna vs Jr.NTR: జూనియర్‌ ఎన్టీఆర్‌ స్పందించకపోతే నాకేంటి? డోంట్‌ కేర్‌.. బాలయ్య బాబు కోపం మాములుగా లేదుగా..!

చంద్రబాబు అరెస్ట్‌పై జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడం తీవ్ర చర్చనీయాంశమవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ స్పందించకపోయినా ఐ డోంట్ కేర్ అని వ్యాఖ్యానించారు. సినిమా వాళ్లు స్పందించపోయినా తాను పట్టించుకోనన్నారు బాలయ్య బాబు.

New Update
Balakrishna vs Jr.NTR: జూనియర్‌ ఎన్టీఆర్‌ స్పందించకపోతే నాకేంటి? డోంట్‌ కేర్‌.. బాలయ్య బాబు కోపం మాములుగా లేదుగా..!

సినీనటుడు, తెలుగుదేశం హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఏం మాట్లాడినా ముఖంపైనే కామెంట్స్ చేస్తారు. బ్యాక్‌ నుంచి మాట్లాడడం బాలయ్య బాబుకు తెలియదు. ఏదైనా సినిమా స్టైల్‌లోనే డైలాగులు పేల్చుతారు. తాజాగా జూనియర్‌ ఎన్టీఆర్‌పై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌గా మారాయి. చంద్రబాబు అరెస్ట్ విషయంలో జూనియన్ ఎన్టీఆర్‌ ఇప్పటివరకు స్పందించని విషయం తెలిసిందే. దీనిపై రిపోర్టర్లు అడిగిన ప్రశ్నకు బాలయ్య బాబు సినిమా స్టైల్‌ డైలాగ్‌ పేల్చారు. జూ.ఎన్టీఆర్ స్పందించకపోతే 'ఐ డోంట్ కేర్' అంటూ కౌంటర్ వేశారు. తెలంగాణ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ టీటీడీపీ నేతలతో బాలకృష్ణ భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌లో టీటీడీపీ నేతలతో బాలకృష్ణ అత్యవసర భేటీ నిర్వహించారు.

బాలకృష్ణ ఇంకేం అన్నారంటే?

➼ జూ.ఎన్టీఆర్ స్పందించకపోతే ఐ డోంట్ కేర్ -బాలకృష్ణ

➼ రోజా ఇష్యూపై మౌనంగా ఉండటమే మేలు -బాలకృష్ణ

➼ బురదపై రాయి వేస్తే మనపై పడుతుంది -బాలకృష్ణ

➼ తెలంగాణలో ఎన్నికలు వస్తున్నాయి.. అందుకే ఎన్టీఆర్ జపం చేస్తున్నారు -బాలకృష్ణ

➼ ఇంతకాలం తెలంగాణలో టీడీపీ అజ్ఞాతంలో ఉంది -బాలకృష్ణ

➼ ఈసారి తెలంగాణ పార్టీ జెండాను రెపరెపలాడుతుంది

➼ పొత్తుల గురించి బాబు నిర్ణయిస్తారు

➼ తెలంగాణలో టీడీపీ లేదన్న వారికి మేమేంటో చూపిస్తాం -బాలకృష్ణ

➼ అక్రమ కేసులు, అరెస్ట్‌లకు భయపడం -బాలకృష్ణ

➼ న్యాయవ్యవస్థపై మాకు నమ్మకం ఉంది-బాలకృష్ణ

➼ ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటాం -బాలకృష్ణ

➼ బాబు అరెస్ట్‌పై న్యాయం పోరాటం చేస్తాం -బాలకృష్ణ

➼ బాబు అరెస్ట్‌పై తప్పకుండా కేంద్రాన్ని కలుస్తాం -బాలకృష్ణ

➼ బీఆర్ఎస్‌లో ఉన్న నేతలంతా టీడీపీ నేతలే-బాలకృష్ణ

➼ సీఎం కేసీఆర్‌ సైతం ఒక్కప్పటి టీడీపీ నేతే-బాలకృష్ణ

జూనియర్ ఎన్టీఆర్‌ ఇష్యూ ఏంటి?
ఏపీ స్కిల్ స్కామ్‌ కేసులో చంద్రబాబు అరెస్ట్ గురించి దేశవ్యాప్తంగా రాజకీయ నేతలతో పాటు సినీ ప్రముఖులు సైతం స్పందించగా.. ఇప్పటివరుకు జూనియర్ ఎన్టీఆర్‌ స్పందించకపోవడం పట్ల టీడీపీ కార్యకర్తల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదే క్రమంలో బాలకృష్ణ సైతం స్పందించడం సంచలనంగా మారింది. జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోతే నాకేంటి అని అర్థం వచ్చేలాగా బాలకృష్ణ కామెంట్స్ చేశారు. నిజానికి చాలా కాలంగా జూనియర్‌ ఎన్టీఆర్‌ రాజకీయ విషయాలకు చాలా దూరంగా ఉంటూ వస్తున్నారు. అటు నందమూరి ఫ్యామిలీ రిలేటెడ్‌ విషయాలకు సైతం దూరంగా ఉంటున్నారు. సీనియర్ ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలకు సైతం జూనియర్‌ హాజరుకాలేదు. ఎన్టీఆర్‌ నాణెం విడుదల సందర్భంగానూ జూనియర్‌ డుమ్మా కొట్టారు.

ALSO READ: సంగీత్‌లో ఈ డ్రెస్సులు వేసుకుంటే డ్యాన్స్‌తో దుమ్మురేపవచ్చు.. ట్రై చేయండి!

CLICK HERE TO VIEW RTV WHATSAPP CHANNEL: మరిన్ని ఇంట్రెస్టింగ్‌ న్యూస్‌ కావాలా? ఆర్టీవీ వాట్సాప్‌ ఛానెల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేసి వార్తలను చూడండి

Advertisment
తాజా కథనాలు