Balakrishna vs Jr.NTR: జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోతే నాకేంటి? డోంట్ కేర్.. బాలయ్య బాబు కోపం మాములుగా లేదుగా..!
చంద్రబాబు అరెస్ట్‌పై జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడం తీవ్ర చర్చనీయాంశమవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ స్పందించకపోయినా ఐ డోంట్ కేర్ అని వ్యాఖ్యానించారు. సినిమా వాళ్లు స్పందించపోయినా తాను పట్టించుకోనన్నారు బాలయ్య బాబు.