Chandrababu Arrest: అడ్డుకున్న పోలీసులు.. రోడ్డుపైనే పడుకున్న పవన్ కల్యాణ్..

అనంచిపల్లి వద్ద పవన్ కల్యాణ్ రోడ్డుపై పడుకుని నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు తనను అడ్డుకోవడాన్ని నిరసిస్తూ ఆయన రోడ్డుపైనే బైఠాయించారు.

New Update
Chandrababu Arrest: అడ్డుకున్న పోలీసులు.. రోడ్డుపైనే పడుకున్న పవన్ కల్యాణ్..

Pawan Kalyan Slept on Road: అ టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ, ఆయన్ని కలిసేందుకు అమరావతికి వెళ్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఆనంచిపల్లి వద్ద పవన్ కల్యాణ్ కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకోగా.. ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కారు దిగి నడుచుకుంటూ అమరావతి వెళ్లే ప్రయత్నం చేశారు. దాంతో ఆ ప్రయత్నాన్ని కూడా అడ్డుకున్నారు పోలీసులు. దాంతో పవన్ కల్యాణ్ నడి రోడ్డుపై పడుకుని తన నిరసనను వ్యక్తం చేశారు. పోలీసులు తనను అడ్డుకోవడాన్ని నిరసిస్తూ ఆయన రోడ్డుపైనే బైఠాయించారు. తాను ఎలాగైనా అమరావతి వెళ్తానని, మంగళగిరి కార్యాలయానికి వెళ్తానని స్పష్టం చేశారు జనసేనాని.

పోలీసుల తీరును నిరసిస్తూ కారు ఎక్కి కూర్చున్న పవన్ కల్యాణ్..

పవన్ కల్యాణ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు..

అనుమంచిపల్లిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసు వాహనంలో ఆయన్ను తరలిస్తున్నారు. అయితే, ఎక్కడికి తరలిస్తున్నారనే సమాచారం మాత్రం ఇవ్వలేదు పోలీసులు.

పవన్ కల్యాణ్ అరెస్ట్..

పవన్ కల్యాణ్‌ను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులు..

పోలీసుల తీరును నిరసనగా కారెక్కిన పవన్..

Also Read:

Chandra Babu Arrest Live Updates: చంద్రబాబుకు బెయిలా? జైలా?..

Advertisment
తాజా కథనాలు