Chandrababu Arrest Live Updates: టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ విపక్ష నేత చంద్రబాబుకు రిమాండ్ విధించింది ఏసీబీ కోర్టు. సీఐడీ అధికారులు అందించిన సాక్ష్యాధారాల ఆధారంగా ఆయనకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చారు జడ్జి. ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు సీఐడీ అధికారులు చంద్రబాబును రాజమండ్రికి తరలించారు. ఇంతకుముందే ఆయన్ను ఏసీబీ కోర్టు నుంచి రాజమండ్రికి తరలించగా.. వారు జైలుకు రీచ్ అవడానికి సుమారు 4 నుంచి 5 గంటల సమయం పట్టే అవకాశం ఉంది.
-
Sep 10, 2023 23:44 ISTజైల్లో చంద్రబాబుకు ప్రత్యేక వసతులు..
చంద్రబాబు పిటిషన్‍పై నిర్ణయం వెల్లడించింది ఏసీబీ కోర్టు. ఆయన విజ్ఞప్తి మేరకు చంద్రబాబుకు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ప్రత్యేక రూం ఇవ్వాలని ఆదేశించింది. చంద్రబాబు మాజీ సీఎం, ప్రతిపక్ష నేత కావడంతో ప్రత్యేక వసతి కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబుకు కావాల్సిన మందులు, వైద్య చికిత్స అందించాలని ఆదేశించింది కోర్టు. అలాగే, చంద్రబాబుకు ఇంటి నుంచి ప్రత్యేక ఆహారం తీసుకొచ్చేందుకు అనుమతించాలని జైలు అధికారులకు ఆదేశాలిచ్చింది. అలాగు, ఆయనకు తగిన భద్రత కల్పించాలని జైలు అధికారులకు సూచించింది ధర్మాసనం.
-
Sep 10, 2023 23:13 ISTతెలుగు ప్రజానికానికి లేఖ రాసిన నారా లోకేష్..
-
Sep 10, 2023 22:57 ISTరాజమండ్రి జైల్లో చంద్రబాబు షెడ్యూల్ ఇదే..
-
Sep 10, 2023 22:55 ISTకోర్టు నుంచి బయటకు వచ్చాక చంద్రబాబు నాయుడి ఫస్ట్ రియాక్షన్ ఇదే..
-
Sep 10, 2023 22:04 ISTజోరు వానలోనూ పార్టీ శ్రేణులకు అభివాదం తెలిపిన చంద్రబాబు..
చంద్రబాబును విజయవాడ నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తున్నారు పోలీసులు. ఆయన కాన్వాయ్‌లోనే తరలిస్తున్నారు. జోరు వాన పడుతున్నప్పటికీ.. తనకు సంఘీభావంగా వచ్చిన పార్టీ కేడర్‌కు, నాయకులకు అభివాదం తెలిపారు చంద్రబాబు నాయుడు. ఇక చంద్రబాబు కాన్వాయ్‌లో పార్టీ నాయకుల వాహనాలను ఆపేశారు పోలీసులు. కేవలం పోలీస్ వాహనాలు, చంద్రబాబు వెహికల్స్‌కు మాత్రమే అనుమతించారు.
-
Sep 10, 2023 21:59 ISTఏపీ వ్యాప్తంగా టెన్షన్ టెన్షన్..
చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా టెన్షన్ వాతావరణం నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇక సోమవారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కు పిలుపునిచ్చింది టీడీపీ. మరోవైపు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన బంద్ కు జనసేన పార్టీ మద్ధతు ప్రకటించింది. జనసేన కార్యకర్తలు శాంతియుతంగా బంద్ లో పాల్గొనాలని పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.
-
Sep 10, 2023 21:53 ISTరాజమండ్రి జైలు అధికారులకు ఏసీబీ కోర్ట్ ఇచ్చిన ఆర్డర్ కాపీ..
చంద్రబాబు నాయుడికి 14 రోజుల రిమాండ్ విధింపునకు సంబంధించి ఏసీబీ కోర్టు ఆర్డర్ కాపీ రాజమండ్రి జైలు అధికారులకు చేరింది. ఆ ఆర్డర్ కాపీ మేరకు చంద్రబాబుకు జైల్లో ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. కాగా, చంద్రబాబును సీఐడీ అధికారులు ఇంతకుముందే ఏసీబీ కోర్టు నుంచి రాజమండ్రికి తరలించారు. వీరు రాజమండ్రి జైలుకు చేరుకునేసరికి తెల్లవారే అవకాశం ఉంది.
-
Sep 10, 2023 21:48 ISTజోరు వానలో చంద్రబాబు తరలింపు.. వెంటే వెళ్తున్న లోకేష్..
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో చంద్రబాబుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించిన నేపథ్యంలో.. పోలీసులు ఆయన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తున్నారు. ఓవైపు భారీ వర్షం కురుస్తున్నప్పటికీ.. పోలీసులు ఆయన్ను కాన్వాయ్‌లో రాజమండ్రికి తీసుకెళ్తున్నారు. ఇక చంద్రబాబుకు సంఘీభావం తెలిపేందుకు భారీ సంఖ్యలో టీటీడీ శ్రేణులు ఏసీబీ కోర్టు వద్దకు వచ్చారు. చంద్రబాబును చూసి నినాదాలు చేస్తున్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలకు అభివాదం చేసుకుంటూ వెళ్లారు చంద్రబాబు. కాగా, చంద్రబాబు వెంట నారా లోకేష్ కూడా వేరే కాన్వాయ్‌తో రాజమండ్రికి బయలుదేరారు.
-
Sep 10, 2023 21:42 ISTచంద్రబాబు రెండు పిటిషన్లపై విచారణ వాయిదా..
హౌస్ అరెస్ట్, స్పెషల్ జైలును కోరుతూ చంద్రబాబు తరఫున లాయర్స్ వేసిన పిటిషన్లపై విచారణను వాయిదా వేసింది కోర్టు. హౌస్ అరెస్ట్‌ను కోరుతూ ఒక పిటిషన్, స్పెషల్ జైలును కోరుతూ మరొక పిటిషన్ న్యాయవాదులు దాఖలు చేయగా.. రెండు పిటిషన్లపై విచారణను రేపటికి వాయిదా వేశారు న్యాయమూర్తి. కస్టడీ కోరుతూ ఇప్పటికే సీఐడీ పిటిషన్ దాఖలు చేయగా.. ఆ పిటిషన్‌పైనా సోమవారమే విచారణ జరుగనుంది. ఇక రిమాండ్ విధించిన నేపథ్యంలో ప్రత్యేక భద్రత మధ్య రాజమండ్రి జైలుకి చంద్రబాబును తరలిస్తున్నారు పోలీసులు. విజయవాడ నుంచి రాజమండ్రికి చేరుకోవడానికి 4 నుంచి 5 గంటల సమయం పట్టనుంది. ఈ లెక్కన చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించడానికి తెల్లవారుజామున 3 గంటలు అయ్యే అవకాశం కనిపిస్తోంది.
-
Sep 10, 2023 21:31 ISTతెలుగుదేశం పార్టీ రాష్ట్ర బంద్‌కు జనసేన మద్దతు..
ప్రతిపక్ష నాయకుడు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ సోమవారం తలపెట్టిన రాష్ట్ర బంద్‌కు జనసేన పార్టీ సంఘీభావం ప్రకటించింది. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా జరిగిన ఈ అరెస్టును ఖండిస్తున్నట్లు జనసేన పార్టీ తెలిపింది. ఈ మేరకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో వ్యవస్థలను నిర్వీర్యం చేసి ప్రజా కంటక చర్యలకు పాలక పక్షం ఒడిగడుతోందంటూ తీవ్ర విమర్శలు చేశారు పవన్. ప్రజా పక్షం వహిస్తూ మాట్లాడే ప్రతిపక్షాలపై రాజకీయ కక్ష సాధింపుతో కేసులు, అరెస్టులతో వేధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. ఈ అప్రజాస్వామిక చర్యలను జనసేన ఎప్పుడూ సహించదని, సోమవారుగ జరుగబోయే బంద్‌లో జనసేన శ్రేణులు శాంతియుతంగా పాల్గొనవలసిందిగా కోరారు.
-
Sep 10, 2023 20:52 ISTరేపు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చిన టీడీపీ..
చంద్రబాబు నాయుడి అరెస్ట్‌ను నిరసిస్తూ, పార్టీ శ్రేణులపై జరిగిన దమనకాండను, జగన్ రెడ్డి కక్షపూరిత రాజకీయాలకు నిరసనగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చారు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.
-
Sep 10, 2023 20:38 ISTచంద్రబాబు అరెస్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణుల ఆందోళనలు..
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ టీడీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా పోలీసులు పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నారు.
-
Sep 10, 2023 20:13 ISTప్రత్యేక విమానంలో రాజమండ్రికి చంద్రబాబు తరలింపు..?
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో అరెస్ట్ అయిన చంద్రబాబును ప్రత్యేక విమానంలో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించనున్నారు పోలీసు అధికారులు. చంద్రబాబును రోడ్డు మార్గంలో తీసుకువెళ్తే భద్రతా పరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. విజయవాడ (గన్నవరం) ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుండి హెలికాప్టర్‌లో రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టు వరకు తీసుకెళ్తారు. అక్కడి నుంచి ప్రత్యేక కాన్వాయ్‌లో సెంట్రల్ జైలుకు చంద్రబాబు నాయుడిని తరలిస్తారని తెలుస్తోంది. అయితే, ఈ రాత్రికి సిట్ ఆఫీస్‌లోనే చంద్రబాబును ఉంచనున్నారని, సోమవారం ఉదయం రాజమండ్రి జైలుకు తరలించే అవకాశం ఉందని తెలుస్తోంది.
-
Sep 10, 2023 20:03 ISTకోర్టుకు చేరుకున్న చంద్రబాబు కుటుంబ సభ్యులు..
చంద్రబాబుకు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులంతా కోర్టు వద్దకు చేరుకున్నారు. దాంతో అక్కడ పరిస్థితి ఉద్విగ్నభరితంగా మారింది.
-
Sep 10, 2023 19:44 ISTఇంటివద్ద సంబరాల్లో మంత్రి రోజా.. చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు..
-
Sep 10, 2023 19:40 ISTచంద్రబాబు అరెస్ట్.. సంబరాలు చేసుకున్న మంత్రి రోజా..
ప్రతిపక్ష నేత చంద్రబాబు అరెస్ట్‌పై మంత్రి రోజా ఫుల్ ఖుషీలో ఉన్నారు. చంద్రబాబుకు రిమాండ్ విధిస్తూ తీర్పు వెలువడగానే.. మంత్రి రోజా క్రాకర్స్ పేల్చి తన సంతోషం వ్యక్తం చేశారు. నగరి నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలకు, నాయకులకు స్వీట్లు పంచి తన ఆనందాన్ని పంచుకున్నారు మంత్రి రోజా. అవినీతిపరుడిని జైలుకు పంపిన ఘనత జగన్ దేనని వెల్లడించారు.
-
Sep 10, 2023 19:33 ISTస్కిల్ డెవలప్మెంట్ కేసులో విలన్ చంద్రబాబు: సజ్జల
స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్ విధించడంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఆయన సీఎంగా ఉన్న సమయంలో జరిగిన భారీ కుంభకోణంలో చంద్రబాబు అరెస్ట్ అయ్యారని అన్నారు. ఈ కేసుకు సంబంధించి అన్ని ఆధారాలను అధికారులు సేకరించారని, ఈ కేసులో ప్రధాన సూత్రదారి చంద్రబాబే అని వ్యా్ఖ్యానించారు. జరగరానికి జరిగినట్లు టీడీపీ నేతలు గగ్గోలు పెడుతున్నారని విమర్శించారు సజ్జల. చంద్రబాబు సొంత కుమారుడి కంటే.. దత్తపుత్రడుగా పేరొందిన పవన్ ఎక్కువగా రియాక్ట్ అవుతున్నారని, ఆయన చేష్టలను అందరూ గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు సజ్జల. రిమాండ్ అనేది పెద్ద విషయం కాదని, నేరం రుజువు కావాల్సి ఉందన్నారు. బరితెగింపు, లెక్కలేనితనంతోనే చంద్రబాబు ఇంలాంటి కుంభకోణాలకు పాల్పడ్డారంటూ తీవ్ర వ్యా్ఖ్యలు చేశారు.
40 ఏళ్ళుగా చంద్రబాబూవి అన్ని కుంబకోణాలేనని, వ్యవస్థలను మ్యానిప్లెట్ చేస్తూ చంద్రబాబు సర్వైవ్ అవుతున్నాడని వ్యాఖ్యానించారు సజ్జల. చంద్రబాబువి మొత్తం అక్రమ మార్గాలేనని, కోర్ట్ స్టేలు తప్ప బాబు ఏం చేశాడని ప్రశ్నించారాయన. '45 ఏళ్ల జీవితంలో తొడ గొట్టి ఛాలెంజ్ చేస్తాడా? నన్నెవరు అరెస్ట్ చేస్తాడని ధీమా.. ఇప్పడు అనుభవం అయిందాయనకు' అంటూ సంచలన కామెంట్స్ చేశారు సజ్జల. అరెస్ట్ సమయంలో ఛాపర్‌లో ఎక్కుంటే త్వరగా అయ్యేదని, పబ్లిసిటీ కోసం ఛాపర్ ఎక్కనన్నాడంటూ చంద్రబాబు తీరును తప్పుపట్టారు. తప్పు చేయకపోతే స్పెషల్ ఫ్లైట్‌లో లాయర్‌ను ఎందుకు తీసుకువచ్చారు? కోట్ల రూపాయలు ఆయనెందుకు ఇస్తున్నారు? అంటూ ప్రశ్నించారు సజ్జల.
-
Sep 10, 2023 19:08 ISTకోర్టు హాల్ నుంచి బయటకు వస్తున్న చంద్రబాబు..
స్కిల్ డెవలప్మెంట్ కేసులో కోర్టు తీర్పు అనంతరం కోర్టు హాల్ నుంచి బయటకు వస్తున్నారు చంద్రబాబు. టీడీపీ శ్రేణుల ఆందోళనల నేపథ్యంలో.. కోర్టు పరిసరాల్లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
-
Sep 10, 2023 19:02 ISTరేపు ఉదయం రాజమండ్రి సెంట్రల్ జైలుకు చంద్రబాబు..
36 గంటల ఉత్కంఠకు తెర దించుతూ ఏసీబీ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. చంద్రబాబుకు 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. ఈ నెల 22వ తేదీ వరకు రిమాండ్ విధించింది. ఈ రాత్రికి చంద్రబాబును సిట్ ఆఫీస్‌కు తీసుకెళ్లనున్నారు పోలీసులు. సోమవారం ఉదయం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తారు. కాగా, స్కిల్ డెవలప్మెంట్ కేసులో సిట్ వాదనలతో ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఏకీభవించారు. సిట్ సమర్పించిన అన్ని ఆధారాలను పరిశీలించిన ధర్మాసనం.. చంద్రబాబుకు రిమాండ్ విధించింది.
-
Sep 10, 2023 18:52 ISTచంద్రబాబుకు 14 రోజుల రిమాండ్.. తీర్పు వెల్లడించిన కోర్టు..
ఏసీ స్కిల్‌డెవలప్‌మెంట్ కేసులో ఏసీబీ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ నెల 22 వరకు చంద్రబాబుకు రిమాండ్ విధించారు.
-
Sep 10, 2023 18:47 ISTతీర్పుపై ఉత్కంఠ.. భారీగా మోహరించిన పోలీసులు..
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తీర్పుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. జడ్జి ఎలాంటి తీర్పునిస్తారని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు టీడీపీ శ్రేణులు. మరోవైపు కోర్టు పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు.
-
Sep 10, 2023 18:46 ISTవైసీపీని తరిమికొట్టేందుకు సిద్ధంగా ప్రజలు: భూమా అఖిల ప్రియ
చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి, టీడీపీ నాయకురాలు భూమా అఖిల ప్రియ. రాష్ట్రంలో ప్రజలు వైసీపీని తరిమికొట్టడానికి ఎదురు చూస్తున్నారని అన్నారు. ప్రజలందరూ చంద్రబాబుకు అండగా ఉన్నారని చెప్పారు. కేంద్రం నుంచి స్పెషల్ స్టేటస్ కాదు కదా.. స్పెషల్ టీ కూడా తెచ్చుకోలేని దుస్థితిలో వైసీపీ ఉందని సెటైర్లు వేశారు మాజీ మంత్రి. ప్రజల అన్ని విషయాలను గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో వారికి తగిన బుద్ధి చెబుతారని అన్నారు.
-
Sep 10, 2023 18:39 ISTపొలిటికల్ ఇమేజ్‌ను డ్యామేజ్ చేసేందుకే చంద్రబాబు అరెస్ట్: కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి
చంద్రబాబు అరెస్ట్‌పై మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. పొలిటికల్ ఇమేజ్‌ను డ్యామేజ్ చేయడానికే చంద్రబాబును అరెస్ట్ చేయించారంటూ వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఎఫ్ఐఆర్‌లో చంద్రబాబు పేరు లేకపోయినప్పటికీ.. అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చర్యలతో వైసీపీ మరోసారి అధికారంలోకి రావాలనుకోవడం వట్టి భ్రమే అవుతుందన్నారు కోట్ల. వివేకా హత్య కేసులో ముద్దాయిగా ఉన్న అవినాష్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదో చెప్పాలని డిమాండ్ చేశారు సూర్య ప్రకాష్ రెడ్డి.
-
Sep 10, 2023 18:19 ISTఏసీబీ కోర్టు తీర్పుపై కొనసాగుతున్న తీవ్ర ఉత్కంఠ..
స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏసీబీ కోర్టు ఎలాంటి తీర్పు వెలువరిస్తుందోనని అంశంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మరికాసేపట్లో తీర్పు వెలువడనున్న నేపథ్యంలో.. కోర్టు హాలులోనే చంద్రబాబు, న్యాయవాది లూథ్రా, నారా లోకేష్ ఎదురు చూస్తున్నారు.
-
Sep 10, 2023 18:12 ISTచంద్రబాబు కేసులో తీర్పును ఇవ్వనున్న న్యాయమూర్తి హిమబిందు..
స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు బెయిల్ అంశంపై జడ్జి హిమబిందు తీర్పు ఇవనున్నారు. మరికొద్ది నిమిషాల్లో తీర్పు వెలువరించనున్నారు.
-
Sep 10, 2023 18:00 ISTలోకేష్ కళ్లలో బాధ.. వైరల్ అవుతున్న ఫోటో
-
Sep 10, 2023 17:56 ISTఅడ్వకేట్ సిద్ధార్థ లోథ్రా విజయదరహాసం..
ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరఫున వాదనలు వినిపించిన అడ్వకేట్ సిద్ధార్థ లోథ్రా.. కోర్టు కిటికీ నుంచి కిందకు చూస్తూ విజయదరహాసం చిందించారు. టీడీపీ శ్రేణులును చూస్తూ విజయం మనదే అన్నట్లుగా సంకేతాలిచ్చారు.
-
Sep 10, 2023 17:55 ISTకోర్టు తీర్పుకోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న చంద్రబాబు, లోకేష్..
-
Sep 10, 2023 17:52 ISTచంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా సామూహిక నిరాహార దీక్షలు