Chandrababu Medical Checkup: చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించిన ప్రభుత్వ వైద్యులు.. వీడియో..!

స్కిల్‌ డెవలప్‌మెంట్ స్కామ్‌ కేసులో చంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేయగా.. ప్రభుత్వ వైద్య సిబ్బంది ఆయనకు మెడికల్‌ టెస్టులు చేశారు. ఓర్వకల్ ఎయిర్ పోర్ట్ నుంచి ఫ్లైట్ ద్వారా చంద్రబాబును విజయవాడ తరలించారు. ఇది నాన్ బెయిలబుల్ నేరమని చెబుతూ బెయిల్‌పై విడుదల చేయలేమని నోటీసులో పేర్కొంది. మీరు కోర్టు ద్వారా మాత్రమే బెయిల్ కోరవచ్చు' అని సీఐడీ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎం ధనుంజయుడు నోటీసులో స్పష్టం చేశారు.

New Update
Chandrababu Medical Checkup: చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించిన ప్రభుత్వ వైద్యులు.. వీడియో..!

Chandrababu Medical Checkup: నంద్యాల జిల్లా టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్టు చేసినట్లు సీఐడీ పోలీసులు అధికారికంగా ప్రకటించారు. చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించారు ప్రభుత్వ వైద్యులు. ఓర్వకల్ ఎయిర్ పోర్ట్ నుంచి ఫ్లైట్ ద్వారా చంద్రబాబును విజయవాడ తరలించారు. ఎఫ్‌ఐఆర్‌లో పేరు లేకుండా అరెస్టు చేయడం, ఆరోపణలకు ఆధారాలు చూపకుండా అరెస్టు చేయడంపై చంద్రబాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆధారాలు చూపిస్తే చట్టానికి సహకరిస్తానని చంద్రబాబు చెప్పారు. అడ్వకేట్లను అవగాహన లేని లాయర్లు అంటూ దురుసుగా వ్యాఖ్యానించిన డీఐజీ రఘురామరెడ్డి. ప్రాథమిక సాక్ష్యం చూపాలని అడిగితే అన్నీ ఇస్తాం అంటూ మాట దాట వేశారు విచారణ అధికారులు. చంద్రబాబును అరెస్టు చేస్తున్నట్లు వ్యక్తిగత సిబ్బందికి సమాచారం ఇచ్చారు పోలీసులు.

Also Read: ఏపీ వ్యాప్తంగా కొనసాగుతోన్న నిర్బంధాలు.. చంద్రబాబు అరెస్ట్‌తో హై డ్రామా!

నంద్యాలలో అరెస్ట్:
స్కిల్‌ డెవలప్‌మెంట్ స్కామ్‌ కేసులో చంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. నంద్యాలలో పర్యటనలో ఉన్న ఆయన్ను విజయవాడకు తరలించారు. నంద్యాల రేంజ్ డీఐజీ రఘురామి రెడ్డి నేతృత్వంలోని పెద్ద సంఖ్యలో పోలీసులు, సీఐడీ తెల్లవారుజామున 3 గంటలకు పట్టణంలోని ఆర్‌కె ఫంక్షన్ హాల్‌లో చంద్రబాబు శిబిరంపైకి వచ్చి ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో ఆయన తన కారవాన్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు. అక్కడకు భారీగా తరలివచ్చిన టీడీపీ శ్రేణుల నుంచి పోలీసులకు తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. చంద్రబాబుకు కాపలాగా ఉన్న SPG బలగాలు కూడా పోలీసులను అనుమతించలేదు. నిబంధనల ప్రకారం ఉదయం 5.30 గంటల వరకు ఎవరినీ చంద్రబాబు వద్దకు అనుమతించలేమని చెప్పారు. చివరకు ఉదయం 6 గంటల ప్రాంతంలో పోలీసులు చంద్రబాబును అరెస్ట్ చేశారు. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో నిందితుడిగా ఉన్న చంద్రబాబును అరెస్ట్ చేస్తున్నట్లు డీఐజీ చెప్పగా.. అందుకు సంబంధించిన నోటీసును టీడీపీ అధినేతకు అందజేశారు.

నాన్‌ బెయిలబుల్‌ ?
క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 50 (1) (2) కింద జారీ చేసిన నోటీసు ప్రకారం, సెక్షన్ 120(8), 166, 167, 418, 420, 465, 468, 471, 409 కింద అరెస్టు చేస్తున్నట్లు పోలీసులు నాయుడుకు తెలియజేశారు. ఇది నాన్ బెయిలబుల్ నేరమని చెబుతూ బెయిల్‌పై విడుదల చేయలేమని నోటీసులో పేర్కొంది. మీరు కోర్టు ద్వారా మాత్రమే బెయిల్ కోరవచ్చు' అని సీఐడీ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎం ధనుంజయుడు నోటీసులో స్పష్టం చేశారు. ఈ కేసులో గతంలో కూడా పలు అరెస్టులు జరిగాయి. మార్చి 4న ఈడీ నలుగురు నిందితులను అరెస్టు చేసింది. సౌమ్యాద్రి శేఖర్ బోస్ (సీమెన్స్ ఇండస్ట్రీ సాఫ్ట్‌వేర్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ మాజీ MD), వికాస్ వినాయక్ ఖాన్వాల్కర్ (పుణెలోని డిజైన్‌టెక్ సిస్టమ్స్ లిమిటెడ్ MD), ముకుల్ చంద్ర అగర్వాల్ (సీమెన్స్‌లో ఆర్థిక సలహాదారు), సురేష్ గోయల్ (SSRA & అసోసియేట్స్ చార్టర్డ్ అకౌంటెంట్)ని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు సంస్థ వారిని విశాఖపట్నం ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ (PMLA) కోర్టులో హాజరుపరిచింది. ప్రస్తుతం వారంతా కస్టడీలోనే ఉన్నారు.

ALSO READ: నా తండ్రిని చూసే హక్కు కూడా నాకు లేదా? ఆ సైకో చెప్పాడా నీకు ? పొదలాడలో టెన్షన్ టెన్షన్!

Advertisment
తాజా కథనాలు