Andhra Pradesh: చంద్రబాబు జైలుకెళ్లడం ఖాయం.. సంచలన కామెంట్స్ చేసిన మంత్రి కొట్టు సత్యనారాయణ..

ప్రతిపక్షాలు ఇండియా అని పేరు పెట్టుకున్నారని, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం భారత్ అనే పేరు పెడుతున్నారనే ఊహాగానాలు వస్తున్నాయి. ఇండియా పేరు భారత్‌గా మార్చడంపై అభిప్రాయాన్ని తమ నాయకుడు వైఎస్ జగన్ చెబుతారు. సీఎం జగన్ అభిప్రాయమే తమ అభిప్రాయం. భారత్ అని పేరు మార్చినంత మాత్రాన బయటివారు ఇండియా అని పిలవకుండా ఉంటారా?

New Update
Andhra Pradesh: చంద్రబాబు జైలుకెళ్లడం ఖాయం.. సంచలన కామెంట్స్ చేసిన మంత్రి కొట్టు సత్యనారాయణ..

Minister Kottu Satyanarayana: విపక్ష నేత చంద్రబాబుకు ఐటీ నోటీసులు ఇవ్వడం, సీఐడీ(CID) ఫోకస్ చేయడంపై ఏపీ మంత్రి కొట్టు సత్యనారాయణ(Kottu Satyanarayana) తనదైన శైలిలో స్పందించారు. చంద్రబాబు, లోకేష్‌ల అరెస్ట్ తప్పదని అన్నారు. 'బాబు-కొడుకుల అరెస్ట్ ఎలా జరుగుతుందనే చర్చ ప్రస్తుతం జరుగుతోంది. తండ్రి బ్రోకర్.. కొడుకు జోకర్. చంద్రబాబు రియల్ ఎస్టేట్ బ్రోకర్ అని ఐటీ శాఖ తేల్చింది. అమరావతిని చంద్రబాబు తన రియల్ ఎస్టేట్ వ్యాపారానికి కేంద్రంగా చేసుకున్నాడు.' అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఐటీ నోటీసుల ద్వారా బయటపడింది ఆవగింజత మాత్రమే అని, చంద్రబాబు హాయాంలో వేల కోట్లు నామినేషన్ పద్ధతిన ఇచ్చేశారని, చంద్రబాబు జైలుకెళ్లడం ఖాయం అన్నారు మంత్రి కొట్టు సత్యనారాయణ.

సింగపూర్ మంత్రి ఈశ్వరన్‌తో ఉన్న లింకులన్నీ బయటపడ్డాయని మంత్రి సత్యనారాయణ అన్నారు. లోకేషును రోడ్డు మీదకు వదిలేశారని, లోకేష్ పాదయాత్ర తర్వాత టీడీపీ గ్రాఫ్ మరింత పడిపోతోందన్నారు. డబ్బులు నొక్కేసే విషయంలో మాత్రం చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ పోటీ పడుతున్నారని విమర్శించారు.

ఇండియా పేరు మార్పుపై మంత్రి షాకింగ్ కామెంట్స్..

'ప్రతిపక్షాలు ఇండియా అని పేరు పెట్టుకున్నారని, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం భారత్ అనే పేరు పెడుతున్నారనే ఊహాగానాలు వస్తున్నాయి. ఇండియా పేరు భారత్‌గా మార్చడంపై అభిప్రాయాన్ని తమ నాయకుడు వైఎస్ జగన్ చెబుతారు. సీఎం జగన్ అభిప్రాయమే తమ అభిప్రాయం. భారత్ అని పేరు మార్చినంత మాత్రాన బయటివారు ఇండియా అని పిలవకుండా ఉంటారా?' అని వ్యాఖ్యానించారు మంత్రి కొట్టు సత్యనారాయణ. ఇక ఏ కూటమిలో ఉన్నారని మీడియా ప్రతినిథులు ప్రశ్నించగా.. తాము 'ఇండియా'లో లేము.. 'ఎన్డీయే'లోనూ లేమని అన్నారు.

ఉదయనిధిపై విసుర్లు..

ఇక తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కొడుకు, ఆ రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన హిందూ ధర్మంపై చేసిన కామెంట్స్‌ను తప్పుపట్టారు. ఆయన ఒక అవివేకి అని, ఆయన చేసిన కామెంట్స్ ఏమాత్రం సరికాదన్నారు మంత్రి సత్యనారాయణ.

Also Read:

Balagam Movie: ‘బలగం’ సినిమా నటుడు మృతి.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన డైరెక్టర్ వేణు..

Dravida vs Sanathana: ద్రవిడ, సనాతన మధ్య ఈ వైరం ఎందుకు? చరిత్ర ఏం చెబుతోంది?

Advertisment
తాజా కథనాలు