CBN Case: చంద్రబాబుకు బిగ్‌ షాక్.. ఆ కేసులో A-1గా టీడీపీ అధినేత.. A2, A3 ఎవరంటే?

టీడీపీ హయాంలో ఫైబర్‌నెట్‌ ప్రాజెక్టులో భారీ అవినీతి జరగగా.. తాజాగా ఈ కేసులో ఏసీబీ కోర్టులో చార్జ్‌షీట్‌ దాఖలు చేసింది సీఐడీ. A1చంద్రబాబు, A2 వేమూరి హరికృష్ణ, A3గా కోగంటి సాంబశివరావు పేర్లను చేర్చింది. అటు టెరాసాఫ్ట్‌ నాసిరకం పరికరాలు సప్లై చేసిందని ఐబీఐ నిర్థారించింది.

New Update
CBN Case: చంద్రబాబుకు బిగ్‌ షాక్.. ఆ కేసులో A-1గా టీడీపీ అధినేత.. A2, A3 ఎవరంటే?

AP FiberNet scam case: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఓవైపు ఎన్నికల ప్రచారాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీలు బిజీగా ఉండగా ఏపీ సీఐడీ తన పని తాను చేసుకుపోతోంది. టీడీపీ అధినేత చంద్రబాబుకు కేసులు సమస్యలు తప్పడం లేదు. స్కిల్‌ స్కామ్‌ కేసులో ఇప్పటికే 52 రోజులు జైలు జీవితం గడిపిన చంద్రబాబును ఫైబర్‌ నెట్‌ స్కామ్‌ కూడా వేధిస్తోంది. ఏపీ ఫైబర్‌ నెట్‌ స్కామ్ కేసులో తాజాగా చార్జ్‌షీట్‌ దాఖలు చేసింది సీఐడీ.

A-25 నుంచి A-1:
విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ చార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. A-1గా చంద్రబాబు, A-2గా వేమూరి హరికృష్ణ, A-3గా కోగంటి సాంబశివరావు పేర్లను సీఐడీ చేర్చింది. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. ఎఫ్‌ఐఆర్‌ నమోదు సమయంలో చంద్రబాబును A-25గా పేర్కొన్న సీఐడీ.. దర్యాప్తులో వెల్లడైన అంశాల ఆధారంగా A-1గా చేర్చింది. ప్రాజెక్ట్‌ మొదటి దశలో రూ.333కోట్ల పనుల్లో అక్రమాలు జరిగినట్టుగా సీఐడీ భావిస్తోంది. నకిలీ ఇన్‌వాయిస్‌లతో షెల్‌ కంపెనీల ద్వారా తరలించినట్టు గుర్తించారు అధికారులు.

ఆయనదే కీలక పాత్ర?
టెరాసాఫ్ట్‌కే ప్రాజెక్ట్‌ను అప్పగించాలని వేమూరిని ఏపీ ఈ-గవర్నింగ్‌ కౌన్సిల్‌లో సభ్యుడిగా చేర్చారని సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా టెండర్ల మదింపు కమిటీలోనూ సభ్యుడిగా నియమించినట్టుగా తెలుస్తోంది. బ్లాక్‌ లిస్ట్‌ నుంచి తొలగించి మరీ వేమూరి కంపెనీకి పనులు అప్పగించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వేమూరి హరికృష్ణ, నాటి ఫైబర్‌ నెట్‌ కార్పొరేషన్‌ ఎండీ కోగంటి సాంబశివరావుది కీలకపాత్రగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫైబర్‌ నెట్‌ స్కాంలో కీలక ఆధారాలను ఏపీ సీఐడీ ఇప్పటికే సేకరించింది. ఐబీఐ గ్రూప్‌ ద్వారా ఆడిటింగ్‌ జరపడంతో వెలుగులోకి అక్రమాలు వచ్చాయి. టెరాసాఫ్ట్‌ నాసిరకం పరికరాలు సప్లై చేసిందని ఐబీఐ గ్రూప్‌ నిర్థారించింది.

Also Read: ఆయనో గొప్ప సంగీత ప్రేమికుడు.. కేసీఆర్‌ గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకోండి!

WATCH:

Advertisment
తాజా కథనాలు