Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ డ్రాఫ్ట్ షెడ్యూల్.. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడంటే.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 డ్రాఫ్ట్ షెడ్యూల్ ప్రకటించారు. పాకిస్తాన్ లో నిర్వహించనున్న ఈ టోర్నీలో భారత్ పాల్గొంటే కనుక పీసీబీ - ఐసీసీకి అందించిన షెడ్యూల్ ప్రకారం పాక్-భారత్ మధ్య హై ఓల్టేజ్ మ్యాచ్ లాహోర్‌లో జరిగే ఛాన్స్ ఉంది. ప్రతిపాదిత షెడ్యూల్ ఆర్టికల్ లో చూడొచ్చు By KVD Varma 09 Jul 2024 in Latest News In Telugu ట్రెండింగ్ New Update షేర్ చేయండి Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 డ్రాఫ్ట్ షెడ్యూల్ ప్రకటించారు.. ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్‌ను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నిర్వహించనుంది. పాకిస్థాన్‌లో జరగనున్న ఈ టోర్నీ ముసాయిదా షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈ షెడ్యూల్ ప్రకారం లాహోర్‌లో టీమిండియా మ్యాచ్‌లు జరగనున్నాయి. అయితే ఈ టోర్నీ కోసం భారత జట్టు పాకిస్థాన్ వెళ్తుందా లేదా అన్నది ఇంకా నిర్ణయం కాలేదు. ఇప్పుడు డ్రాఫ్ట్ షెడ్యూల్ ఐసిసికి పంపించింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. ఇప్పుడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు దాని ఆమోదం కోసం ఎదురుచూస్తోంది. Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ డ్రాఫ్ట్ షెడ్యూల్ రెడీ అయింది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నిర్వహించనున్న ఈ వన్డే టోర్నీ తాత్కాలిక షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌కు పంపగా, ఈ షెడ్యూల్ ప్రకారం వచ్చే ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. కరాచీ వేదికగా జరగనున్న ఈ టోర్నీలో తొలి మ్యాచ్ ఆతిథ్య పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనుంది. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో ఆడడం ద్వారా భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ జర్నీ ప్రారంభించనున్నట్లు సమాచారం. 8 జట్లు.. రెండు గ్రూప్స్.. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో మొత్తం 8 జట్లు తలపడనున్నాయి. ఈ జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. ఇక్కడ భారత్, పాక్ జట్లు ఒకే గ్రూప్‌లో ఉండటంతో తొలి రౌండ్‌లో తలపడటం ఖాయంగా కనిపిస్తోంది. దీని ప్రకారం మార్చి 1న జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ 11వ మ్యాచ్‌లో సంప్రదాయ ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. లాహోర్‌లోని గడాఫీ స్టేడియం ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. అలాగే మార్చి 9న ఫైనల్ మ్యాచ్ జరగనుందని సమాచారం. Here's a look at the anticipated schedule for the Champions Trophy 2025 in Pakistan.🇵🇰🏏 . . . .#jannatupdates #Pakistan #ChampionsTrophy #ODIs #cricketlife #CricketUpdates #cricketWorld pic.twitter.com/2Ax95D7zy2 — Jannat Updates (@JannatUpdates18) July 9, 2024 Also Read: శ్రీలంక టూర్‌కు రోహిత్, కోహ్లీ, బుమ్రా మిస్..! కారణం ఏంటో తెలుసా? ఛాంపియన్స్ ట్రోఫీ జట్లు: గ్రూప్-ఎ భారతదేశం పాకిస్తాన్ బంగ్లాదేశ్ న్యూజిలాండ్ గ్రూప్-బి ఆస్ట్రేలియా ఇంగ్లండ్ దక్షిణ ఆఫ్రికా ఆఫ్ఘనిస్తాన్.ఛాంపియన్స్ ట్రోఫీ డ్రాఫ్ట్ షెడ్యూల్ ఇలా ఉంది: తేదీ ఎవరితో ఎవరు ఎక్కడ జరుగుతుందంటే ఫిబ్రవరి, 19 పాకిస్థాన్ vs న్యూజిలాండ్ కరాచీ ఫిబ్రవరి, 20 బంగ్లాదేశ్ vs భారత్ లాహోర్ ఫిబ్రవరి, 21 ఆఫ్ఘనిస్తాన్ vs దక్షిణాఫ్రికా కరాచీ ఫిబ్రవరి, 22 ఆస్ట్రేలియా vs ఇంగ్లాండ్ లాహోర్ ఫిబ్రవరి, 23 న్యూజిలాండ్ vs భారత్ లాహోర్ ఫిబ్రవరి, 24 పాకిస్థాన్ vs బంగ్లాదేశ్ రావల్పిండి ఫిబ్రవరి, 25 ఆఫ్ఘనిస్తాన్ vs ఇంగ్లాండ్ లాహోర్ ఫిబ్రవరి, 26 ఆస్ట్రేలియా vs సౌతాఫ్రికా రావల్పిండి ఫిబ్రవరి, 27 బంగ్లాదేశ్ vs న్యూజిలాండ్ లాహోర్ ఫిబ్రవరి, 28 ఆఫ్ఘనిస్తాన్ vs ఆస్ట్రేలియా రావల్పిండి మార్చి, 1 పాకిస్థాన్ vs భారత్ లాహోర్ మార్చి, 2 దక్షిణాఫ్రికా vs ఇంగ్లాండ్ రావల్పిండి మార్చి, 5 సెమీఫైనల్-1 కరాచీ మార్చి, 6 సెమీఫైనల్-2 రావల్పిండి మార్చి, 9 ఫైనల్ మ్యాచ్ లాహోర్ #champions-trophy-2025 #icc #pakistan-cricket-board మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్‌లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి