Chalo Vijayawada: ఐడి కార్డులు చూపించాలి.. ఛలో విజయవాడకు హైకోర్టు ఓకే.. కండీషన్స్‌ అప్లై!

కొన్ని షరతులతో 'ఛలో విజయవాడ'కు హైకోర్టు అనుమతించింది. 500 మందితో పరిమితమైన ఆంక్షలతో ధర్నా చౌక్‌లో ధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చింది. వారం రోజుల ముందు ధర్నాలో పాల్గొనే ఉద్యోగులు ఆధార్ కార్డులు పోలీసులకు అందించాలని హైకోర్టు చెప్పింది.

New Update
Chalo Vijayawada: ఐడి కార్డులు చూపించాలి.. ఛలో విజయవాడకు హైకోర్టు ఓకే.. కండీషన్స్‌ అప్లై!

సీపీయస్ ఉద్యోగుల రేపటి(సెప్టెంబర్ 1) ఛలో విజయవాడ కార్యక్రమానికి ఏపీ హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. పరిమితమైన ఆంక్షలతో కూడిన అనుమతులతో ఛలో విజయవాడ కార్యక్రమం జరుపుకోమని హైకోర్టు చెప్పింది. కార్యక్రమంలో పాల్గొనే ఉద్యోగులు ఐడీ కార్డులను చూపించాలని కోర్టు తెలిపింది. నిజానికి గతంలో ఛలో విజయవాడ సందర్భంగా చోటుచేసుకున్న ఎపిసోడ్‌ల కారణంగా ఈసారి అనుమతి ఇచ్చేందుకు ప్రభుత్వం నిరాకరించింది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ప్రభుత్వం తరుపు న్యాయవాది మహేశ్వరరెడ్డి వాదించారు. అనుమతులు ఇవ్వొద్దని కోరారు. అయితే నిరసన వ్యక్తం చేయడం రాజ్యాంగబద్దమని.. ప్రతి ఒక్కరి హక్కు అని కోర్టు తేల్చి చెప్పింది. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది.

500మందితో అనుమతి:
విద్యుత్ స్త్రగుల్ కమిటీ ధర్నా అంశంపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. 500 మందితో పరిమితమైన ఆంక్షలతో ధర్నా చౌక్‌లో ధర్నాకు హైకోర్టు అనుమతిచ్చింది. వారం రోజుల ముందు ధర్నాలో పాల్గొనే ఉద్యోగులు ఆధార్ కార్డులు పోలీసులకు అందించాలని హైకోర్టు చెప్పింది. ఆదివారం సెలవు దినం రెండు గంటల సమయం మాత్రమే ధర్నాకు అనుమతి ఉందని తెలిపింది. ఇక రేపు పిటిషనర్ తరుపు వాదనలు న్యాయవాది మాధవ్ రావు వినిపించనున్నారు. నిజానికి రేపు(సెప్టెంబర్ 1) లక్ష మంది ఉద్యోగులతో చలో విజయవాడను నిర్వహించేందుకు ఏపీ సీపీఎస్ ఉద్యోగుల సంఘం ఏర్పాట్లు చేసుకుంది.

వాస్తవానికి ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్ రద్దు చేయాలన్న డిమాండ్‌ని ఏపీ ప్రభుత్వం ముందు గట్టిగా వినిపిస్తున్నారు ఉద్యోగ సంఘాల నేతలు. రెండు రోజుల క్రితం మంత్రులతో భేటీ అయిన ఉద్యోగ సంఘాల నేతలో మంత్రి బొత్స చర్చించారు. కొన్ని అంశాలు చేర్చాలని ఉద్యోగ సంఘాలు అడిగినట్టు బొత్స చెప్పారు. అధ్యయనం చేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఉద్యోగ సంఘాల నేతలకు చెప్పినట్టు తెలిపారు.జీపీఎస్‌ (GPS)పై ఉద్యోగ సంఘాలతో చర్చలను సీపీఎస్(CPS) ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ప్రభుత్వం ప్రతిపాదించిన గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్(GPS)ని ఒప్పుకునేది లేదని తెగేసి చెబుతున్నారు. ఏపీ సీఎం ఇచ్చిన మాటను వేరే రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుని అమలు చేస్తున్నాయంటున్నారు ఉద్యోగులు. మొత్తం పెన్షన్ డబ్బులు అన్నీ ఆన్స్యూటి సర్వీస్ ప్రొవైడర్‌కు ఇవ్వాలంటున్నారు.

ALSO READ: ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్ రద్దు చేయాలి.. ఉద్యోగ సంఘాల డిమాండ్‌..!

Advertisment
తాజా కథనాలు