SBI New Chairman: ఎస్‌బీఐ ఛైర్మన్‌గా తెలంగాణ బిడ్డ.. గద్వాల్ వాసికి అరుదైన గౌరవం!

తెలంగాణ గద్వాల్‌కు చెందిన చల్లా శ్రీనివాసులు శెట్టి 'స్టేట్ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా' ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఆయన నియామకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఇప్పటికే ఎస్‌బీఐలో సీనియర్​మేనేజింగ్​డైరెక్టర్‌గా పనిచేస్తున్న శ్రీనివాసులు 3ఏళ్లపాటు ఛైర్మన్ పదవిలో కొనసాగనున్నారు.

New Update
SBI New Chairman: ఎస్‌బీఐ ఛైర్మన్‌గా తెలంగాణ బిడ్డ.. గద్వాల్ వాసికి అరుదైన గౌరవం!

Challa Srinivasulu: తెలంగాణ గద్వాల్ కు చెందిన చల్లా శ్రీనివాసులు శెట్టికి అరుదైన గౌరవం దక్కింది. ఇండియాలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు 'స్టేట్ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా'కు ఛైర్మన్​గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఇప్పటికే ఎస్​బీఐలో సీనియర్​మేనేజింగ్​డైరెక్టర్​(MD)గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసులు.. 3ఏళ్లపాటు ఛైర్మన్ పదవిలో కొనసాగనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పనితీరు, మొత్తం అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని చల్లా శ్రీనివాసులు శెట్టిని ఎస్​బీఐ చైర్మన్ పదవికి సిఫార్సు చేశామని ఎఫ్​ఎస్​ఐబీ ఒక ప్రకటనలో పేర్కొంది.

ఎఫ్​ఎస్​ఐబీ సిఫార్సు మేరకు ఆమోదం.. 
ఈ మేరకు ప్రస్తుత ఛైర్మన్​దినేశ్ కుమార్​ఖారా ఆగస్టు 28న పదవీ విరమణ చేయగానే.. అదే రోజు శ్రీనివాసులు బాధ్యతలు స్వీకరించనున్నట్లు స్పష్టం చేసింది. ఆర్థికసేవల విభాగం ప్రతిపాదన మేరకు మంత్రి వర్గ నియామకాల సంఘం శ్రీనివాసులు శెట్టి పదవికి ఆమోదం తెలిపినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఎస్​బీఐ చైర్మన్ పదవికి గరిష్ట వయో పరిమితి 63 ఏళ్లుగా నియమించారు. ఇక ఎస్​బీఐ చైర్మన్ పదవికి చల్లా శ్రీనివాసులు శెట్టి పేరును ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇనిస్టిట్యూషన్స్ బ్యూరో (ఎఫ్​ఎస్​ఐబీ) సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. కాగా అంతర్జాతీయ బ్యాంకింగ్, గ్లోబల్ మార్కెట్స్, టెక్నాలజీ వర్టికల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన కార్యకలాపాలను శ్రీనివాసులు చూసుకుంటున్నారు.

ఇది కూడా చదవండి: Anganwadi: నిరుద్యోగ మహిళలకు గుడ్ న్యూస్.. అంగన్‌వాడీ కేంద్రాల్లో 9వేల ఉద్యోగాలు!

గద్వాల జిల్లా పెద్దపోతులపాడులో జన్మించి..
తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా పెద్దపోతులపాడులో జన్మించిన శ్రీనివాస్.. అగ్రికల్చర్​లో బ్యాచిలర్​ ఆఫ్​ సైన్స్​ పట్టా పొందారు. అయితే తన వృత్తి జీవితాన్ని ఎస్​బీఐలో 1988లో ప్రొబేషనరీ అధికారిగా(పీఓ)గా మొదలుపెట్టారు. ఎస్‌బీఐలో సుమారు 35 ఏళ్లుగా పనిచేస్తున్న శ్రీనివాసులు శెట్టి ప్రస్తుతం ఆ బ్యాంకులోనే అత్యున్నతమైన స్థాయికి చేరుకున్నారు. ఇక ఎస్​బీఐలో పనిచేస్తున్న మేనేజింగ్ డైరెక్టర్ల బృందం నుంచి చైర్మన్ ను నియమిస్తారు. దీనిపై నిర్ణయం తీసుకునే క్యాబినెట్ నియామకాల కమిటీ (ఏసీసీ)కి ఎఫ్​ఎస్​ఐబీ పేరును సిఫారసు చేస్తుంది. ఏసీసీకి ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం వహిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు