ప్రత్యేక హోదా- ఆంధ్రుల హక్కుపై పోరాడుదాం..!

గుంటూరులో ప్రత్యేక హోదా- ఆంధ్రుల హక్కుపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. భావితరాల కోసం ప్రత్యేక హోదాపై రాష్ట్రంలో ఉన్న పార్టీలన్నీ ఐకమత్యంగా పోరాటానికి సిద్ధం కావాలని పిలుపు నిచ్చారు ప్రత్యేక హోదా సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్.

New Update
ప్రత్యేక హోదా- ఆంధ్రుల హక్కుపై పోరాడుదాం..!

Chalasani Srinivas: ప్రత్యేక హోదా- ఆంధ్రుల హక్కుపై గుంటూరులో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక హోదా సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. భావితరాల కోసం ప్రత్యేక హోదాపై రాష్ట్రంలో ఉన్న పార్టీలన్నీ ఐకమత్యంగా పోరాటానికి సిద్ధం కావాలని పిలుపు నిచ్చారు. 26 జలాల్లో ఏదో ఒక చోట హోదా అంశంపై పోరాటం చేస్తూనే ఉన్నామని తెలిపారు.

Also Read: ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ సతీమణి డెలివరీ

దేశ రాజధాని ఢిల్లీలో ప్రత్యేక హోదా- ఆంధ్రుల హక్కుపై  అర్ధనగ్న ప్రదర్శనలు చేస్తే తీవ్ర ఇబ్బందులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు చలసాని శ్రీనివాస్. హోదాపై నిబద్ధతతో పోరాటం చేస్తున్నామని వెల్లడించారు. ప్రత్యేక హోదాపై ఆత్మాహుతి దాడికి పాల్పడిన వారిని కాపాడుకోవడం కోసం తీవ్రంగా పోరాటం చేశామని అన్నారు. ముఖ్యమంత్రి ఓట్లకోసం   నాడు ఒకమాటా నేడు ఒకమాట మాట్లాడటం దారుణమని విమర్శించారు. 13 కోట్ల తెలుగు వారిని కులాలు మతాల వారిగా విడగొట్టి దేశంలో పాలన సాగుతోందని దుయ్యబట్టారు.

కేంద్రంలో బీజేపీ విభజించు పాలించు రీతిలో పాలన చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్ కక్ష సాధింపు చర్యలపై పెట్టిన దృష్టి ప్రత్యేక హోదాపై పెడితే రాష్ట్రం ఎప్పుడో అభివృద్ధి చెందేదని సెటైర్ వేశారు. ఎంపీలు పార్లమెంట్‌లో హోదాగురించి మాట్లాడకపోవడం విడ్డురంగా ఉందని ఎద్దెవ చేశారు చలసాని శ్రీనివాస్.ఇప్పటికైనా అఖిలపక్షం సమావేశం నిర్వహించాలని సూచించారు. రాష్ట్రంలో ఉన్న పార్టీలు కేంద్ర ప్రభుత్వానికి భయపడుతున్నారని వ్యాఖ్యనించారు.

ఈ సమావేశం పాల్గొన్న ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ పురందేశ్వరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి బీజేపీ ప్రభుత్వం ఏమిచేసిందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిని ప్రశ్నించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంటే ఏపీకి ప్రత్యేక హోదా రాదని పేర్కొన్నారు. పోరాటం కోసం ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్న పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి హోదాపై పోరాటానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు