Harrassment on Girl Students: పాఠాలు చెప్పే టీచరే కీచకుడయ్యాడు. విద్యార్థినులతో కిరాతకంగా వ్యవహరించాడు. హనుమకొండ జిల్లా భీమారంలో. శ్రీచైతన్య జూనియర్ కాలేజీలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. చైర్మన్ బూర సురేందర్ గౌడ్ తన కాలేజీలో విద్యార్థినులను వేధిస్తున్నాడంటూ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
విద్యార్థులను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన స్థానంలో ఉన్న వ్యక్తే ఇలా వంకర బుద్ధి ప్రదర్శించడంపై తల్లిదండ్రులతో పాటు స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కాలేజీ ఎదుట ఆందోళనకు దిగి చైర్మన్‌కు తగిన బుద్ధి చెప్పాల్సిందే అని డిమాండ్ చేశారు. కాగా, ఐదు రోజుల క్రితం విద్యార్థినులను కల్లు తాగాలంటూ సురేందర్ గౌడ్ బలవంత పెట్టినట్లు కూడా తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇది కూడా చదవండి: న్యూ ఇయర్ ఈవెంట్లో డీజే పెడితే మీకు భాజానే.. పోలీసుల వార్నింగ్
మరోవైపు విద్యార్థినుల విషయమై ట్యూటర్లను కూడా సురేందర్ వేధిస్తున్నారని తెలుస్తోంది. ఈ వివరాలు వెల్లడిస్తూ విద్యార్థినుల తల్లిదండ్రులు కంటతడి పెట్టారు. కాలేజీ చైర్మన్ సురేందర్ గౌడ్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విద్యార్థినులను విచారించడంతో పాటు కాలేజీలోని సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించారు. అయితే అతడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.