నైజర్ లోని భారత పౌరులకు భారత విదేశాంగ శాఖ కీలక సూచనలు..!

ఆఫ్రికాలోని నైజర్ దేశంలో వున్న భారత పౌరులకు భారత విదేశాంగ శాఖ కీలక సూచనలు చేసింది. నైజర్ లో నెలకొన్న తీవ్రమైన హింసాకాండ నేపథ్యంలో భారత పౌరులు వీలైనంత త్వరగా ఆ దేశాన్ని విడిచి వెళ్లాలని సూచనలు చేసింది. నైజర్ వెళ్లాలనుకునే భారతీయులు పునరాలోచించుకోవాలని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ వెల్లడించారు.

author-image
By G Ramu
New Update

ప్రస్తుతం నైజన్ తన ఎయిర్ స్పేస్ ను మూసి వేసిందని ఆయన తెలిపారు. అందువల్ల పౌరులు సరిహద్దుల ద్వారా ఇతర దేశాలకు చేరుకోవాలనుకునే వారు భద్రతా పరంగా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయస సూచించారు. ఇప్పటికే చాలా మంది భారత పౌరులు నియామీలోని భారత రాయబార కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకున్నారని పేర్కొన్నారు.

ఇంకా పేర్లు నమోదు చేసుకోని వారు ఉంటే వెంటనే భారత రాయబార కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఏదైనా సహాయం కోసం నైజర్ లోని భారత పౌరులు భారత రాయబార కార్యాలయం, నియామీ (+ 227 9975 9975)ను సంప్రదింవచ్చని తెలిపారు. ఇక నైజర్ వెళ్లాలనుకునే భారతీయులు తమ ప్రయాణాలను రద్దు చేసుకోవాలన్నారు.

ఈ ఏడాది జూలై 26న నైజర్ లో సైనిక తిరుగుబాటు జరిగింది. ఆ దేశ అధ్యక్షుడు మొహమ్మద్ బజౌమ్‌ను ఆ దేశ సైన్యం బంధించింది. అనంతరం ఆర్మీ జనరల్ అబ్దుల్ రహమాన్ అధికారాన్ని తన చేతుల్లోకి తీసుకున్నారు. ఆ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత సైనిక తిరుగుబాటు జరగడం ఇది ఐదో సారి. సైనిక తిరుగుబాటును ఆ దేశ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు