New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/NTA-Subodh-Kumar.jpg)
NTA Director General Subodh Kumar: దేశవ్యాప్తంగా NEET పేపర్ లీక్ ఘటనపై పెద్ద ఎత్తున ఆందోళనలు, విమర్శలు రావడంతో కేంద్రం సీరియస్ గా తీసుకుంది. ఇప్పటికే దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించగా.. తాజాగా ఎన్టీయే చీఫ్ సుబోధ్ సింగ్‌ను ఆ బాధ్యతల నుంచి తొలిగించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అతన్ని సీబీఐ విచారించాలని పేర్కొంది. అతని స్థానంలో రిటైర్డ్ ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ (ఐఏఎస్) అధికారి ప్రదీప్ సింగ్ ఖరోలాను (Pradeep Singh Kharola) నియమించినట్లు సిబ్బంది మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
ఖరోలా ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ ఛైర్మన్, మేనేజింగ్ ఎడిటర్, NTA డైరెక్టర్ జనరల్‌గా "సాధారణ పదవిలో ఉన్న వ్యక్తిని నియమించే వరకు లేదా తదుపరి ఉత్తర్వుల వరకు అదనపు బాధ్యతలు అప్పగించింది. ఏజెన్సీ పనితీరును మెరుగుపరచడానికి సిఫార్సులను అందించే కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొన్ని గంటల తర్వాత, NEET-UG కోసం గ్రేస్ మార్కులు పొందిన సుమారు 1,500 మంది విద్యార్థులు మళ్లీ పరీక్షకు హాజరు కావడానికి ఒక రోజు ముందు ఈ నరిణయాన్ని కేంద్రం తీసుకుంది.
తాజా కథనాలు