Delhi: ఐఏఎస్ నుంచి పూజా ఖేద్కర్ తొలగింపు

మాజీ ఐఏఎస్ ప్రొబేషనరీ అధికారిణి పూజా ఖేద్కర్‌‌ విషయంలో కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆమెను ఐఏఎస్ నుంచి తొలగిస్తూ షాక్ ఇచ్చింది. అంతకు ముందు ఆమె సభ్యత్వాన్ని యూపీఎస్సీ కాన్సిల్ చేసింది. 

New Update
Delhi: ఐఏఎస్ నుంచి పూజా ఖేద్కర్ తొలగింపు

Puja Khedkar: మాజీ ఐఏఎస్‌ అధికారిణి పూజా ఖేద్కర్‌ విషయంలో కేంద్రం మొత్తానికి నిర్ణయం తీసుకుంది. ఇన్నాళ్ళూ ప్రొబేషన్‌లో ఉన్న పూజాను ఇండియన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌ నుంచి తొలగించింది. ఐఏఎస్‌ (ప్రొబేషన్‌) రూల్స్‌, 1954 ప్రకారం ఆమెపై చర్యలు తీసుకున్నట్లు అధికారులు చెప్పారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపారు. పుణెలో ట్రైనీ సహాయ కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న సమయంలో ఆమెపై అధికార దుర్వినియోగంతో పాటు యూపీఎస్సీలో తప్పుడు అఫిడవిట్‌ పత్రాలు సమర్పించారనే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.

పూణెలో సహాయ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న పూజా ఖేద్కర్‌పై ఆరోపణలు రావడం వల్ల ఆమెను వాసిమ్‌ జిల్లాకు ట్రాన్స్‌ఫర్ చేసిన విషయం తెలిసిందే. ఒక కాంట్రక్టర్ నుంచి తీసుకున్న ప్రైవేటు ఆడీ కారుకు సైరన్, మహారాష్ట్ర ప్రభుత్వ స్టిక్కర్, వీఐపీ నెంబర్ ప్లేట్లను పర్మిషన్ లేకుండా ఆమెపై ఫిర్యాదు చేయగా.. ఆమెకు సంబంధించి మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. యూపీఎస్సీకి ఆమె తప్పుడు సర్టిఫికేట్లు ఇచ్చి పరీక్షలు రాశారని, ఆమెకు దృష్టిలోపం, మానసిక సమస్యలు ఉన్నట్లు చెప్పుకున్నారని ఆరోపణలు వచ్చాయి. సెలక్షన్ కమిటీ ఆమెను వైద్యపరీల కోసం ఎయిమ్స్‌కు పిలవగా..కరోన సాకుతో ఆమె వెళ్లలేదు.

చివరికి ఆమె సివిల్ సర్వీసెస్ అపాయింట్‌మెంట్‌ పూర్తయింది. ఆ తర్వాత సెలక్షన్ కమిషన్‌ ఆమె ఎంపికను ట్రైబ్యూనల్‌లో సవాలు చేసింది. 2023 ఫిబ్రవరిలో ఆమెకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. అయినప్పటికీ కూడా పూజా ఖేద్కర్‌ రాజకీయ పలుకుబడితో తన నియామకం కన్‌ఫర్మ్‌ చేసుకుంది. ఆమె ఓబీసీ కేటగిరి కింద సివిల్స్ పరీక్ష రాసింది. దానికి సంబంధించిన సర్టిఫికేట్‌లో కూడా తన తల్లిదండ్రుల ఆదాయం ఏడాదికి రూ.8 లక్షలుగా రాయించుకుంది. కానీ వాస్తవానికి పూజ తండ్రి దిలీప్‌ ఖేద్కర్‌ ఒక రిటైర్ట్‌ ప్రభుత్వ అధికారి. వారి వార్షిక ఆదాయం రూ.49 లక్షలు. వాళ్లకున్న మిగతా ఆస్తులన్నీ కలిపితే ఏకంగా రూ.100 కోట్లకు పైగా ఉంటుంది. ఓబీసీ కేటగిరి ఆదారంగానే ఆమె 841వ ర్యాంక్ సాధించి ఐఏఎస్‌ హోదాను సంపాదించగలిగింది.

దీంతో పూజా సివిల్స్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తున్నట్లు తాజాగా యూపీఎస్సీ (UPSC) ప్రకటించింది. అలాగే ఆమె భవిష్యత్తులో పరీక్షలకు హాజరు కాకుండా డిబార్ చేసింది. తప్పుడు పత్రాలతో పూజా ఐఏఎస్ ఉద్యోగం పొందారని.. అధికారం దుర్వినియోగానికి పాల్పడ్డారని ఇటీవల ఆమెపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఇటీవల యూపీఎస్సీ ఆమె సర్వీసును తాత్కలికంగా హోల్డ్‌లో పెట్టింది. తప్పుడు పత్రాలతో పూజా ఉద్యోగం పొందినట్లు నిర్దారణ కావడంతో.. చివరికి ఇప్పుడు ఆమె సివిల్స్‌ అభ్యర్థిత్వాన్ని రద్దు చేసింది. ఇప్పుడు ఏకంగా ఐఎఏస్ నుంచి తొలగించింది ప్రభుత్వం.

Also Read: Assam: అస్సాంలో ఆధార్ కార్డుల జారీకి కొత్త రూల్

Advertisment
Advertisment
తాజా కథనాలు