Central Bank: ఉద్యోగార్థులకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది. దేశ వ్యాప్తంగా ఉన్న ఉన్న శాఖల్లో వివిధ స్పెషలిస్ట్ కేటగిరీల కింది పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ఖాళీలు, అర్హతల వివరాలిలా ఉన్నాయి.
కేటగిరీ వారీగా ఖాళీలు:
1. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ- 01
2. రిస్క్ మేనేజ్మెంట్/ ఏజీఎం- 01
3. రిస్క్ మేనేజ్మెంట్/ సీఎం- 01
4. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఎస్ఎం- 06
5. ఫైనాన్షియల్ అనలిస్ట్/ ఎస్ఎం- 05
6. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ మేనేజర్- 73
7. లా ఆఫీసర్- 15
8. క్రెడిట్ ఆఫీసర్- 50
9. ఫైనాన్షియల్ అనలిస్ట్ మేనేజర్- 04
10. సీఏ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ జీఎస్టీ/ ఐఏ/ బ్యాలెన్స్ షీట్/ టాక్సేషన్- 03
11. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఏఎం- 15
12. సెక్యూరిటీ ఆఫీసర్- 15
13. రిస్క్ మేనేజర్- 02
14. లైబ్రేరియన్- 01
మొత్తం ఖాళీల సంఖ్య: 192.
అర్హతలు: సంబంధిత విభాగంలో సీఏ, ఐసీఏఐ, ఐసీడబ్ల్యూఏఐ, సీఎఫ్ఏ, ఏసీఎంఏ, డిగ్రీ, డిప్లొమా, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.850, జీఎస్టీ (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.175, జీఎస్టీ).
ముఖ్య తేదీలు:
ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 19-11-2023
ఇంటర్వ్యూ తేదీ: డిసెంబర్ 3, 4వ వారం - 2023.