RRC Recruitment 2023: సెంట్రల్ రైల్వే రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కొసం అప్లికేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. భారతీయ రైల్వేలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం వెతుకుతున్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ జూనియర్ ఇంజనీర్, లోకో పైలట్, గార్డ్/ట్రైన్ మేనేజర్ పోస్టుల కోసం మొత్తం 1,303 ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తిగల అభ్యర్థులు సెంట్రల్ రైల్వే అధికారిక వెబ్‌సైట్, rrccr.com ని విజిట్ చేసి అప్లై చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ GDCE కోటా ద్వారా నిర్వహించారు. ఆగస్టు 1, 2023 నాటికి రెగ్యులర్, అర్హత ఉన్న సెంట్రల్ రైల్వే ఉద్యోగులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు తప్పనిసరిగా ఆగస్టు 1, 2021న లేదా అంతకు ముందు రైల్వేలో పని చేయడం ప్రారంభించి ఉండాలి. పదవీ విరమణ చేసిన లేదా మరొక రైల్వేకు బదిలీ చేయబడిన వారు రిక్రూట్‌మెంట్ కోసం పరిగణించబడరు. మరో రెండు రోజుల్లో అప్లికేషన్ గడువు ముగుస్తుంది.
ఒక్కో పోస్టుకు భర్తీ చేయాల్సిన పోస్టుల సంఖ్య వివరాలు
అసిస్టెంట్ లోకో పైలట్ - 732 ఖాళీలు
టెక్నీషియన్ - 255 ఖాళీలు
జూనియర్ ఇంజనీర్ - 234 ఖాళీలు
గార్డ్/ట్రైన్ మేనేజర్ - 82 ఖాళీలు
దరఖాస్తు ప్రక్రియ ఇలా..
ముందుగా RRC/CR’s అధికారిక పోర్టల్ www.rrccr.com ను విజిట్ చేయాలి.
హోమ్ పేజీలోకి వెళ్లి, న్యూ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
దీంతో కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్, 11 డిజిట్ ఎంప్లాయి ఐడీ నంబర్ వంటి పర్సనల్ వివరాలను ఎంటర్ చేయాలి.
రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్ వివరాలు మీ మెయిల్‌కు వస్తుంది.
వాటి సాయంతో లాగిన్ అయి అప్లికేషన్ ఫారమ్ ఫిలప్ చేయాలి.
అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి. చివరగా అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
విద్యార్హత:
అసిస్టెంట్ లోకో పైలట్ - మెట్రిక్యులేషన్ లేదా SSLC పూర్తి చేసిన తర్వాత గుర్తింపు పొందిన సంస్థల ద్వారా పొందిన NCVT/SCVT ట్రేడ్‌లలో ITI లేదా ITI స్థానంలో గుర్తింపు పొందిన సంస్థ ద్వారా పొందిన వివిధ ఇంజనీరింగ్ సబ్జెక్టులలో మూడేళ్ల డిగ్రీ.
టెక్నీషియన్ - మెట్రిక్యులేషన్ లేదా SSLCతో పాటు NCVT లేదా SCVT ద్వారా గుర్తింపు పొందిన ట్రేడ్ స్కూల్ నుంచి ITI సర్టిఫికేట్.
జూనియర్ ఇంజనీర్ - పేరున్న యూనివర్సిటీ నుంచి ఏదైనా బేసిక్ స్ట్రీమ్ సబ్‌స్ట్రీమ్‌లో మూడేళ్ల డిప్లొమా.
దరఖాస్తుదారుల వయస్సు పరిమితి:
అన్‌రిజర్వ్ - 42 సంవత్సరాలు
OBC - 45 సంవత్సరాలు
SC/ST - 47 సంవత్సరాలు
ముఖ్యమైన తేదీలు:
నోటిఫికేషన్ ప్రచురణ తేదీ - ఆగస్టు 1
ఫారమ్‌లను ఆన్‌లైన్‌లో సమర్పించడానికి ప్రారంభ తేదీ - ఆగస్టు 3
ఆన్‌లైన్ ఫారమ్‌ల సమర్పణకు చివరి తేదీ - సెప్టెంబర్ 2
ALSO READ: పిల్లలకు సెప్టెంబర్‌లో పండుగే పండుగా.. ఎన్ని రోజులు సెలవులంటే?