/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-12T155132.720-jpg.webp)
సీఎం రేవంత్‌పై కేంద్రమంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. ఏం సాధించారని సంబరాలు చేసుకుంటున్నారని ఎక్స్‌లో ట్వీట్ చేశారు. రబీ, ఖరీఫ్‌లో చెల్లించాల్సిన రైతు భరోసా సొమ్ము ఎగ్గొట్టినందుకా..? రుణమాఫీలో కోతపెట్టి రైతులను మోసం చేసినందుకా..? పంట నష్టపరిహారం ఇవ్వకుండా అన్నదాతలను గోస పెట్టినందుకా..? అంటూ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల లబ్ధి పొందేందుకే రుణమాఫీ డ్రామా అంటూ విమర్శించారు.
రైతు భరోసా పేరుతో రబీ, ఖరీఫ్ సీజన్లలో రైతులకు, కౌలు రైతులకు రూ.15 వేలు, రైతు కూలీలకు రూ.12 వేలు ఎందుకివ్వలేదు..? అని ప్రశ్నించారు. ఖరీఫ్, రబీ సీజన్లలో రైతులకు చెల్లించాల్సిన రైతు భరోసా సొమ్ము రూ.20 వేల కోట్లకుపైనే ఉంటుందన్నారు. రైతు భరోసా సొమ్ము ఎగ్గొట్టి ఆ డబ్బులతో ఇప్పుడు రుణమాఫీ చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
What has the Congress govt in Telangana achieved to celebrate?
> Is it for failing to disburse the promised amount of Rythu Bharosa during Rabi and Kharif seasons?
> Is it for deceiving farmers by putting restrictions on the loan waiver?
> Is it for leaving the farmers in…
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) July 18, 2024
గత ప్రభుత్వ మూర్ఖత్వం వల్లే రైతులు డిఫాల్టర్లుగా మారారన్నారు. బ్యాంకులో రూ.2 లక్షల్లోపు రుణాలు తీసుకున్న రైతులకు వడ్డీతోసహా బకాయిలు చెల్లించి నో డ్యూస్ సర్టిఫికెట్ ఇప్పించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీ మేరకు రైతులకు కొత్త రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.