Fraud Apps: నకిలీ లోన్, బెట్టింగ్ యాప్‌లపై కేంద్రం కొరడా.. సోషల్ మీడియా ఫ్లాట్‌ఫారమ్స్‌కు వార్నింగ్!

సోషల్ మీడియాలో మోసపూరిత రుణ యాప్‌ల ప్రకటనలపై కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ యాడ్స్‌ తొలగింపు బాధ్యత సోషల్‌మీడియా ఫ్లాట్‌ఫారమ్స్‌దేనని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు. ఫేక్‌లోన్‌ యాప్స్‌ బారిన పడి చాలా సందర్భాల్లో బాధితులు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు.

Fraud Apps: నకిలీ లోన్, బెట్టింగ్ యాప్‌లపై కేంద్రం కొరడా.. సోషల్ మీడియా ఫ్లాట్‌ఫారమ్స్‌కు వార్నింగ్!
New Update

నకిలీ లోన్‌ యాప్‌(Fake Loan Apps)లు ఎంతో మంది అమాయకుల ప్రాణాల్ని బలిగొంటున్నాయి. అవసరం లేదన్నా.. వెంటపడి మరి లోన్లు ఇవ్వడం.. అధిక ఇంట్రెస్ట్‌కు డబ్బుల వసూళ్లు చేయడం.. డబ్బులు కట్టలేని పరిస్థితుల్లో ఉంటే వేధింపులకు గురి చేసి చంపడం లోన్‌ యాప్‌ నిర్వాహకులకే చెల్లింది. ముందుగా మొబైల్‌లోని గ్యాలరీ యాక్సిస్‌ తీసుకునే ఫ్రాడ్‌గాళ్లు లోన్‌ యూజర్‌కు చెందిన ఫొటోను దొంగిలించడం.. తర్వాత మార్ఫింగ్‌లు చేయడం.. బెదిరింపు డబ్బులు గుంజుకోవడం చేస్తుంటారు. లేకపోతే సంబంధిత వ్యక్తి మొబైల్‌ కాంటాక్ట్స్‌లోని అందరికి కాల్స్‌ చేసి టార్చర్‌ చేస్తుంటారు. మరోవైపు బెట్టింగ్‌ యాప్స్‌ ప్రజల ప్రాణాలు తోడేస్తున్నాయి. బెట్టింగ్‌లు వేసి వేలు, లక్షలు పొగొట్టుకున్న వారి సంఖ్య నానాటికి పెరుగుతోంది. వీటి కట్టడికి కేంద్రం ఇప్పటికే పలు చర్యలు తీసుకోగా.. తాజాగా సోషల్‌మీడియా(Social Media) ఫ్లాట్‌ఫారమ్స్‌కు కూడా కీలక సూచనలు జారీ చేసింది.

అవి తొలగించండి:
సోషల్ మీడియాలో మోసపూరిత రుణ యాప్‌ల ప్రకటనలపై కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. అక్రమ రుణ యాప్‌లు, బెట్టింగ్ యాప్‌లను తొలగించాలని మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. నకిలీ రుణ యాప్‌ల ప్రకటనలను అరికట్టేందుకు కృషి చేస్తున్నామని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. ఇలాంటి నకిలీ రుణ యాప్‌ల ప్రకటనలు చాలా ప్లాట్‌ఫారమ్‌లలో కనిపిస్తాయి. అందుకే వాటిని తొలగించాల్సిన బాధ్యత సంబంధిత ఫ్లాట్‌ఫారమ్స్‌దేనని కేంద్రం స్పష్టం చేసింది.

లింక్స్‌పై క్లిక్‌ చేయవద్దు:
ఇటీవలి కాలంలో నకిలీ రుణ యాప్‌ల నెట్‌వర్క్‌ బాగా విస్తరించింది. ఇలాంటి యాప్‌ల బారిన పడిన వ్యక్తులు అప్పుల ఊబిలో కూరుకుపోవడమే కాకుండా చాలా సందర్భాల్లో బాధితులు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. ఈ విషయం చాలా కాలంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఇప్పటివరకు ప్రభుత్వం అలాంటి అనేక యాప్‌లను నిషేధించింది. అయితే, ఈ యాప్‌లు ఏదో ఒక రూపంలో మళ్లీ కొత్త పేరుతో వస్తాయి. అలాంటి యాప్‌లలో, ముందుగా, కస్టమర్‌లకు ఒకే క్లిక్‌లో పత్రాలు లేకుండా రుణాలు అందించబడతాయి. చాలా మంది ఇలాంటి రుణాల ఉచ్చులో పడతారు. ఈ లోన్ యాప్‌లు స్పైవేర్‌లా కూడా పనిచేస్తాయి.

Also Read: బీచ్‌లో భర్తతో సైనా నెహ్వాల్‌ బోల్డ్‌ డ్యాన్స్‌ 😝.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. వైరల్‌ వీడియో!

WATCH:

#fake-loan-apps
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe