Direct Tax: కేంద్రానికి డైరెక్ట్ టాక్స్ ల డబ్బుల వర్షం.. ఈ ఏడాది ఎంత వచ్చిందంటే..

డైరెక్ట్ టాక్సెస్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరుతోంది. ఈ ఆర్ధిక సంవత్సరం డిసెంబర్ నాటికి 13.70 లక్షల కోట్ల రూపాయలు డైరెక్ట్ టాక్సెస్ ద్వారా వచ్చాయి. గతేడాది ఇదే సమయానికి వచ్చిన ఆదాయం కంటే ఇది రూ.2,25,251 కోట్లు ఎక్కువ.  

New Update
Direct Tax: కేంద్రానికి డైరెక్ట్ టాక్స్ ల డబ్బుల వర్షం.. ఈ ఏడాది ఎంత వచ్చిందంటే..

Direct Tax: డైరెక్ట్ టాక్స్ అంటే ఇన్ కమ్ టాక్స్ శాఖ ద్వారా ప్రభుత్వానికి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. ఈ ఆర్థిక సంవత్సరం (2023-24)డిసెంబర్ వరకు నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 20.66% పెరిగి రూ.13.7 లక్షల కోట్లకు చేరాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం, క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది రూ.11,35,754 కోట్లుగా ఉంది. 2023 డిసెంబర్ 17 వరకు రూ.2,25,251 కోట్లు ఎక్కువ వసూలు అయ్యాయి.  నవంబర్ 9, 2023 వరకు కేంద్రం రూ. 10.60 లక్షల కోట్ల నికర ప్రత్యక్ష పన్ను వసూలు చేసింది. నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ. రూ.13,70,388 కోట్లలో సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ టాక్స్ (STT), కార్పొరేట్ ట్యాక్స్ (CIT) మరియు వ్యక్తిగత ఆదాయపు పన్ను (PIT) ఉన్నాయి. నికర ప్రత్యక్ష పన్ను(Direct Tax) మొత్తంలో CIT రూ. 6,94,798 కోట్లు (నికర వాపసు) - STTతో సహా PIT రూ. 6,72,962 కోట్లు.

నిరంతర పెరుగుదల

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (డిసెంబర్ 17 వరకు) ప్రత్యక్ష పన్నుల(Direct Tax) స్థూల వసూళ్ల తాత్కాలిక గణాంకాలు ఏడాది ప్రాతిపదికన 17.01% పెరిగాయి. ఈసారి గ్రాస్ వసూళ్లు రూ.15,95,639 కోట్లు. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఇది రూ.13,63,649 కోట్లు.

  • మొత్తం టాక్స్ కలెక్షన్ – రూ. 15,95,639
  • సిఐటి - రూ. 7,90,049 కోట్లు
  • PIT - రూ. 8,02,902 కోట్లు

Also Read: రూపాయి పెడితే రూపాయి పావలా లాభం.. బంగారం లాంటి పెట్టుబడి.. 

అడ్వాన్స్ టాక్స్ వసూళ్లు.. 

2023-24 ఆర్థిక సంవత్సరంలో (డిసెంబర్ 17 వరకు) మొత్తం ముందస్తు పన్ను వసూళ్ల(Direct Tax) తాత్కాలిక గణాంకాలు వార్షిక ప్రాతిపదికన 19.94% పెరిగి రూ.6,25,249 కోట్లకు చేరాయి. 2022-23 ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో రూ. 5,21,302 కోట్ల అడ్వాన్స్ ట్యాక్స్ వసూళ్లు జరిగాయి. ముందస్తు పన్ను వసూలు మొత్తంలో కార్పొరేషన్ పన్ను (సిఐటి) రూ. 4,81,840 కోట్లు ఉన్నాయి. కాగా వ్యక్తిగత ఆదాయ పన్ను రూ.1,43,404 కోట్లుగా ఉంది. 

Watch this interesting Video:

Advertisment
తాజా కథనాలు