Padmasri Awards 2024: తెలుగు రాష్ట్రాల 'పద్మశ్రీ'లు వీరే.. 2024 సంవత్సరానికి పద్మ పురస్కారాలను కేంద్రం ప్రకటించింది. మొత్తం 34 మందిని పద్మశ్రీ పురస్కారాలు వరించాయి. ఇందులో తెలుగు రాష్ట్రాల ముగ్గురు కళాకారులు కూడా ఉన్నారు. యక్షగాన కళాకారుడు, బుర్ర వీణ వాయిద్యకారుడు, హరికథా కళాకారిణులకు ఈసారి ప్రతిష్ఠాత్మక అవార్డు దక్కింది. By Naren Kumar 25 Jan 2024 in ఆంధ్రప్రదేశ్ తెలంగాణ New Update షేర్ చేయండి Padmasri Awards 2024: ప్రతిష్ఠాత్మక పద్మ పురస్కారాలను 2024 సంవత్సరానికి కేంద్రప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 34 మందిని పద్మశ్రీ పురస్కారాలు వరించాయి. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు కళాకారులు కూడా ఉన్నారు. తెలంగాణలోని జనగామ జిల్లాకు చెందిన యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్యకు పద్మశ్రీ పురస్కారం దక్కింది. నారాయణపేట జిల్లా దామరగిద్ద వాసి దాసరి కొండప్పను కూడా పద్మశ్రీ వరించింది. కొండప్ప బుర్ర వీణ వాయిద్యకారుడు. వారితో పాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన హరికథా కళాకారిణి ఉమామహేశ్వరికి కూడా పద్మశ్రీ పురస్కారం లభించింది. ఆమెది కృష్ణా జిల్లా మచిలీ పట్నం. #padma-awards-2024 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి