నేడు కేంద్ర కేబినేట్ భేటీ...మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణపై కీలక నిర్ణయం..!!

ఇవాళ కేంద్రకేబినెట్ సమావేశం కానుంది. ఈ సమావేశంలో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణపై కీలక నిర్ణాయాలు తీసుకునే అవకాశం ఉంది. మంత్రివర్గ విస్తరణపై ఇప్పటికే ద్రుష్టి సారించిన మోడీ..మంత్రి వర్గాన్ని విస్తరించాలని డిసైడ్ అయ్యారు. దీనిపై గత వారం రోజులుగా కసరత్తు జరుగుతోన్న సంగతి తెలిసిందే.

New Update
నేడు మోదీ సర్కార్ పై అవిశ్వాస తీర్మానం. రెడీ అవుతున్న ప్రతిపక్షనేతలు..!!

నేడు ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేత్రుత్వంలో కేంద్రమంత్రి వర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కేంద్ర కేబినెట్ విస్తరణపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ అంశంపై ఇప్పటికే ద్రుష్టి సారించిన మోడీ...మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని డిసైడ్ అయ్యారు. దాదాపు వారం రోజులుగా ఈ అంశంపై కసరత్తు జరుగుతూనే ఉంది. గత కొంతకాలంగా సంస్థాగత మార్పులతోపాటు కేంద్ర కేబినెట్ లో మార్పులు చేయడంపై వరసగా సమావేశం అవుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర కేబినెట్ నేడు ఢిల్లీలో భేటీ కానుంది. పార్లమెంట్ సమావేశాలు త్వరలోనే ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్లమెంట్ లో ప్రవేశపెట్టే బిల్లులపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ప్రధానిమోడీ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది.

pm modi

అయితే ప్రధాని మోడీ ప్రాన్స్ పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో...పర్యటనకు ముందే మంత్రివర్గ విస్తరణ ఉండటం ఖాయమని తెలుస్తోంది. కాగా శాఖల కేటాయింపులపై ఇప్పటికే కసరత్తు పూర్తయినట్లు సోర్స్ ద్వారా తెలుస్తోంది. అందులో భాగంగానే కేంద్రమంత్రులను ఆ బాధ్యతల నుంచి తప్పించి వారిని పార్టీ అవసరాల కోసం పంపించే అవకాశం ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కిషన్ రెడ్డి తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా నియమించిన సంగతి తెలిసిందే. మరికొంతమంది కేంద్ర మంత్రులను పంపించే చాన్స్ ఉంది.అయితే తెలంగాణ నుంచి బండి సంజయ్ కు కేంద్ర మంత్రి పదవి దక్కుతుందన్న సమాచారం వస్తోంది.

అయితే మొత్తానికి కేంద్రకేబినెట్ భేటీ ఇవాళ కానీ రేపు కానీ ఉండే అవకాశం ఉంది. పునర్ వ్యవస్థీకరణ ప్రక్రియ దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. జూలై 20న పాతపార్లమెంట్ భవనంలో ప్రారంభమై ఆగస్టు 11న ముగుస్తాయనున్నాయి. పార్లమెంట్ ఎన్నికలకు కేవలం 8 నెలల సమయం మాత్రమే ఉండడంతో ఈ వర్షాకాల సమావేశాలపై చర్చించేందుకు పలు పార్టీలు సిద్ధమవుతున్నాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు