Breaking : ఎన్నికల వేళ కేంద్రం సంచలనం.. సెప్టెంబర్ 17పై కీలక నిర్ణయం!

లోకసభ ఎన్నికలకు ముందు కేంద్రంలో మోదీ సర్కార్ సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది. సెప్టెంబర్ 17వ తేదీని అధికారికంగా  హైదరాబాద్ విమోచన దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించింది.

New Update
PM Modi: రేపు ప్రధానిగా మోదీ ప్రమాణస్వీకారం.. ఢిల్లీలో నో ఫ్లయింగ్‌ జోన్‌

Modi Sarkar : లోకసభ ఎన్నికల(Lok Sabha Elections) కు ముందు కేంద్రంలో మోదీ సర్కార్(Modi Sarkar) సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది. సెప్టెంబర్ 17వ తేదీని అధికారికంగా  హైదరాబాద్(Hyderabad) విమోచన దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించింది. ప్రతి ఏటా సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవంగా జరుపుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.

ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీన హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని(Hyderabad Liberation Day) నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ డిమాండ్ ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ..లోకసభ ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని జరుపుకోవడానికి ఆమోదం తెలిపింది.

publive-image

నిజానికి హైదరాబాద్ చరిత్రలో సెప్టెంబర్ 17కి చారిత్రక ప్రాధాన్యత ఉంది. ఈ రోజున హైదరాబాద్ నిజాంషాహి నుండి స్వాతంత్య్రం పొందింది. అది భారత యూనియన్‌లో భాగమైంది. గత ఏడాది కూడా సెప్టెంబర్ 17న కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగా రాజకీయ పార్టీలు విమోచన దినోత్సవాన్ని జరుపుకోవడానికి వెనుకాడుతున్నారని అన్నారు. ఇలాంటి ఆలోచన దురదృష్టకరమని ఆయన అన్నారు.

నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్‌ను భారత భద్రతా దళాలు 1948 సెప్టెంబర్ 17న ఆపరేషన్ పోలో అనే ప్రచారాన్ని నిర్వహించి ఇండియన్ యూనియన్‌లో విలీనం చేశాయి.

ఇది కూడా చదవండి : తెలంగాణలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఇదే..!

Advertisment
తాజా కథనాలు