India vs Pak: పాక్‌ క్రికెట్ జట్టుతో ద్వైపాక్షిక సిరీస్‌లపై కేంద్రం క్లారిటీ

భారత్-పాక్ మ్యాచ్ అంటే ఉండే మజానే వేరు. బంతి బంతికి నరాలు తెగే ఉత్కంఠ. దాయాది దేశాలు తలపడుతుంతే ప్రపంచంలోని క్రికెట్ అభిమానులందరూ టీవీలకు అతుక్కుపోతారు. తమ దేశం గెలవాంటే తమ దేశం గెలవాలని దేవుడిని ప్రార్థిస్తూ ఉంటారు.

New Update
India vs Pak: పాక్‌ క్రికెట్ జట్టుతో ద్వైపాక్షిక సిరీస్‌లపై కేంద్రం క్లారిటీ

India vs Pak: భారత్-పాక్ మ్యాచ్ అంటే ఉండే మజానే వేరు. బంతి బంతికి నరాలు తెగే ఉత్కంఠ. దాయాది దేశాలు తలపడుతుంతే ప్రపంచంలోని క్రికెట్ అభిమానులందరూ టీవీలకు అతుక్కుపోతారు. తమ దేశం గెలవాంటే తమ దేశం గెలవాలని దేవుడిని ప్రార్థిస్తూ ఉంటారు. ఓడిపోయిన జట్టు నిరాశలో మునిగిపోతే.. గెలిచిన జట్టు సంబరాల్లో తేలుతుంది. ఐసీసీ టోర్నీల్లో తప్పితే ఇరు జట్లు మ్యాచులు ఆడటం లేదు. ఇరు దేశాల సరిహద్దుల మధ్య ఉన్న ఉద్రికత్తల నేపథ్యంలో రెండు జట్లు ద్వైపాక్షిక సిరీస్‌లకు చాలా కాలంగా దూరంగానే ఉన్నాయి. దీనిపై భారత ప్రభుత్వం తన వైఖరిని మరోసారి వెల్లడించింది.

కశ్మీర్ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు సైనికాధికారులు వీరమరణం పొందిన నేపథ్యంలో కేంద్ర క్రీడల శాఖ మంత్రి స్పందిస్తూ ఉగ్రవాదానికి అడ్డుకట్ట వేసేంతవరకు పాకిస్థాన్ జట్టుతో ద్వైపాక్షిక క్రికెట్ ఆడేది లేదని స్పష్టం చేశారు. దేశ ప్రజల అభిప్రాయాలు కూడా తమకు ముఖ్యమేనని, ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోమని తేల్చిచెప్పారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ఆపినప్పుడే పాక్‌తో క్రీడా కార్యక్రమాలు జరుగుతాయని వెల్లడించారు. మరోవైపు పాకిస్థాన్ జట్టుతో ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్‌లకు సంబంధించి తమ వద్ద స్పష్టమైన విధానం ఉందని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఉగ్రవాదంపై ఇరు దేశాలు కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని శుక్లా తెలిపారు.

సరిహద్దు సమస్యలు, ఉగ్రవాదం వంటి కారణాలతో భారత్, పాకిస్థాన్ మధ్య క్రికెట్ సంబంధాలు మెరుగ్గా లేని సంగతి తెలిసిందే. చివరగా 2008లో భారత్ జట్టు పాకిస్థాన్‌లో పర్యటించింది. ఇక 2007లో రెండు టీమ్స్ మధ్య టెస్ట్ సిరీస్ జరిగింది. 2012-13 సీజన్‌లో పాక్ జట్టు ద్వైపాక్షిక సిరీస్ కోసం భారత్ వచ్చింది. అప్పటి నుంచి ఇంత వరకు ఇరు జట్ల మధ్య సిరీస్ జరగలేదు. కేవలం ఆసియా కప్‌తో పాటు ఐసీసీ టోర్నమెంట్స్‌లో భారత్- పాక్ మ్యాచులు ఆడుతున్నాయి.

ఇది కూడా చదవండి: పాక్‌కు మరో షాక్ ఇచ్చిన భారత్.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా హవా

Advertisment
Advertisment
తాజా కథనాలు