Casting couch: డర్టీ పిక్చర్ ఆఫ్ టాలీవుడ్.. ఒక్క ఛాన్స్ దక్కాలంటే వారి కోరిక తీర్చాలిందే!

నిజానికి తెలుగు ఫిల్మ్‌ ఇండస్ట్రీ అసలు అమ్మాయిలకు సేఫ్‌ కాదన్న వాదన ఈనాటిది కాదు.. దశాబ్దాలుగా ఉంది.. పాత తరం నుంచి ఈ తరం హీరోయిన్లు, ఇతర మహిళా క్యారెక్టర్‌ ఆర్టిస్టులు అనేక సందర్భాల్లో క్యాస్టింగ్‌ కౌచ్ గురించి తమ బాధలు చెప్పుకున్నారు.

New Update
Casting couch: డర్టీ పిక్చర్ ఆఫ్ టాలీవుడ్.. ఒక్క ఛాన్స్ దక్కాలంటే వారి కోరిక తీర్చాలిందే!

సినిమాల్లో ఆడవాళ్ల గొప్పతనం గురించి గుక్కతిప్పకుండా హీరోలు భారీ డైలాగులు చెబుతారు.. అది చూసి అభిమానులు ఈలలు, గోలలు చేస్తారు. అయితే అదంతా ఆన్‌ స్కీనే.. ఆఫ్‌ స్కీన్‌లో బాబు గార్లు చాలా డేంజర్‌. సినిమా సెట్‌లో లైట్‌ ఆఫ్‌ అవ్వగానే అసలు రూపాన్ని బయటపెడతారు. హీరోయిన్లను రూమ్‌కు రమ్మంటారు. ఇతర మహిళా క్యారెక్టర్‌ ఆర్టిస్టులను గెస్ట్‌ హౌస్‌కు పిలుస్తారు. నిర్మాతల నుంచి సినిమాల్లో నటించే కమెడియన్ల వరకు ఏ ఒక్కరూ తక్కువ కాదు.. ఆడదంటే వారికి ఓ సెక్స్ టాయ్‌ మాత్రమే.. ! బడా బాబులు చెప్పింది వినకపోతే, చేయకపోతే ఆఫర్లే ఉండవు.. ఇవ్వని ఇండస్ట్రీలో ఉన్న దాదాపు అందరికి తెలిసిన విషయాలే.. అందుకే నటి సమంత గళం విప్పింది. జస్టిస్ హేమ తరహాలో టాలీవుడ్‌లోనూ కమిటీని తీసుకు రావాలని సీఎం రేవంత్‌ రెడ్డికి రిక్వెస్ట్ చేసింది.

మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను వెలుగులోకి తెచ్చిన హేమ కమిటీ కృషిని సమంత ప్రశంసించారు. ఈ కమిటీని ఏర్పాటు చేసినందుకు WCC-విమెన్ ఇన్ ఫిల్మ్ కలెక్టివ్‌ని కూడా ఆమె అభినందించారు. సినీ పరిశ్రమలో మహిళల సంరక్షణ కోసం ఆ సంస్థ అవిశ్రాంతంగా పాటుపడుతోందన్నారు సమంత. 2019లో స్థాపించిన టాలీవుడ్ సపోర్టు గ్రూప్ అయిన వాయిస్ ఆఫ్ విమెన్ కూడా WCC కమిటీ ఆధ్వర్యంలోకి రావాలని కోరారు. తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా జస్టిస్ హేమ తరహాలో కమిటీని తీసుకు రావాలని చెప్పిన సమంత.. ఇండస్ట్రీలో మహిళలకు సురక్షితమైన పని వాతావరణాన్ని కల్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతూ సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు.

'టాలీవుడ్‌లోనూ కాస్టింగ్ కౌచ్ ఉంది. అవ‌కాశాలు ఇస్తామ‌ని చెప్పి హీరోయిన్స్‌కు ఎర వేయ‌డం అనే సంస్కృతిని తెలుగు సినిమాలో నేనూ చూశాను. చాలా మంది మ‌హిళ‌లు కాస్టింగ్ కౌచ్ స‌మ‌స్యతో బాధ‌ప‌డుతున్నవారే. అయితే నేను నిజాయ‌తీగా, నిక్కచ్చిగా మాట్లాడ‌టంతో అలాంటి ఇబ్బందిక‌ర‌మైన ప‌రిస్థితులు నాకు ఎదురు కాలేదు. సినిమా పరిశ్రమలోనే కాదు. అన్నిచోట్ల మహిళలకు ఇలాంటి ఇబ్బందులున్నాయి..' ఇది అనుష్కశెట్టి ఓ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు. జేజేమ్మ లాంటి స్టార్‌ హీరోయిన్లే ఈ విషయాన్ని చెప్పారంటే టాలీవుడ్‌లో కామిస్టులు ఏ స్థాయిలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.

నిజానికి తెలుగు ఫిల్మ్‌ ఇండస్ట్రీ అసలు అమ్మాయిలకు సేఫ్‌ కాదన్న వాదన ఈనాటిది కాదు.. దశాబ్దాలుగా ఉంది.. పాత తరం నుంచి ఈ తరం హీరోయిన్లు, ఇతర మహిళా క్యారెక్టర్‌ ఆర్టిస్టులు అనేక సందర్భాల్లో క్యాస్టింగ్‌ కౌచ్ గురించి తమ బాధలు చెప్పుకున్నారు. వారి బెడ్ రూమ్‌కు వెళ్లాల్సిందే.. వారి కోరికలు తీర్చాల్సిందే.. లేకపోతే కక్షసాధింపులకు దిగుతారు. ఇండస్ట్రీలో క్యాస్టింగ్‌ కారణంగా చాలా మంది టాలెంట్ ఆర్టిస్టులు సరైన అవకాశాలను పొందలేకపోతున్నారు.

టాలీవుడ్‌తో పాటు ఏ ఇండస్ట్రీలో రాణించాలంటే దర్శక, నిర్మాతల కోరికలను తీర్చాలటస్‌. సినిమాల్లో అవకాశాలు రావాలంటే వారికి కచ్చితంగా నగ్నంగా కనిపించాల్సిందేనట. ఆడిషన్స్‌కు పిలుస్తారు.. కమిట్‌మెంట్‌ అడుగుతారు.. ఒప్పుకోకపోవడంతో ఆఫర్లు రాకుండా చేస్తారు. ఇది బాలీవుడ్ నటి నర్గీస్‌ ఫక్రీ ఓ సారి చెప్పిన నగ్న సత్యం. అటు రాధికా ఆప్టే కూడా టాలీవుడ్ హీరోతో ఇబ్బంది పడ్డానని ఓ సారి చెప్పుకొచ్చింది.

అటు సీనియర్ నటి విచిత్ర గతంలో చేసిన కామెంట్స్‌ టాలీవుడ్‌లో పెను ప్రకంపనలు సృష్టించాయి. ఓ టాలీవుడ్ హీరో ఒకరోజు రాత్రి తన గదికి రమ్మన్నాడని , తాను రాను అని చెప్పడంతో బయట డోర్ వేసి వేధించడాని చెప్పింది విచిత్ర. ఇక బాలయ్యబాబు నటించిన భలేవాడివి బాసూ సినిమాలో విచిత్ర నటించారు. ఓ సారి ఓ స్టార్‌ హీరో మీద నటి మాధవీలత క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేశారు. ఇలా చాలా మందిపై అనేక ఆరోపణలు ఉన్నాయి. అవి నిజాలో కాదో తెలియాలంటే సమంత చెప్పినట్టు ప్రభుత్వం ఓ కమిటీ వేసి తీరాల్సిందేనని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు!

Advertisment
Advertisment
తాజా కథనాలు