BJP MP Candidate Madhavi Latha: హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవి లతపై కేసు నమోదు అయింది. బేగంబజార్ మాస్క్ దగ్గర బాణం వదిలిన వ్యవహారంపై మాధవి లతపై కేసు నమోదు చేశారు. శ్రీరామనవమి శోభ యాత్రలో మాధవి లత బాణం వదిలిన సంగతి తెలిసిందే. కాగా మసీద్ వైపు చూపుతూ మాధవి లత బాణం ఎత్తి చూపడాన్ని ఎంఐఎం అభ్యంతరం వ్యక్తం చేసింది.
ALSO READ: మందుబాబులకు షాకింగ్ న్యూస్.. ఎల్లుండి వైన్స్ బంద్!
ఇటీవల వీడియోపై క్షమాపణలు చెప్పారు..
మసీద్‌పై తాను బాణం ఎక్కు పెట్టినట్లుగా ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంపై స్పందించారు హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి కొంపెల్ల మాధవి లత. తనపై బురదజల్లేందుకే కొందరు కావాలని తప్పుడు వీడియో ప్రచారం చేస్తున్నారని.. అది పూర్తి వీడియో కాదని మాధవి లత క్లారిటీ ఇచ్చారు. ఈ వీడియో వల్ల ఎవరి మనోభావాలు దెబ్బతింటే వారిని తనను క్షమించాలని కోరుతున్నానని.. నేను ఎవరి మనోభావాలను దెబ్బతీయాలని అనుకోనని అన్నారు. తనకు అందరు సమానమే అని పేర్కొన్నారు. ఎవరైనా ఆ తప్పుడు వీడియో వల్ల బాధపడి ఉంటే సారీ అని అన్నారు. ఇది కేవలం తనను రాజకీయంగా ఎదురుకోలేక చేస్తున్న తప్పుడు ప్రచారం అని ఆమె ఫైర్ అయ్యారు. కాగా ఇదే అంశంపై అసదుద్దీన్ ఓవైసీ సీరియస్ అయ్యారు. ఆమె తీరు ఈసీ,పోలీసులకి కనిపించదా అంటూ ఫైర్ అయ్యారు.