Bigg Boss Winner: బిగ్ బాస్ సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్ కు పెద్ద షాకిచ్చారు పోలీసులు. విజేతను ప్రకటించిన అనంతరం అన్నపూర్ణ స్టూడియో ముందు ఫ్యాన్స్ వీరంగం సృష్టించారు. ఒకరి పై ఒకరు దాడులకు పాల్పడ్డారు. గ్రాండ్ ఫినాలే షో తర్వాత కంటెస్టెంట్స్ తిరిగి వెళ్తుండగా.. రన్నరప్ అమర్ దీప్ కారు తో పాటు పలువురు ఎక్స్ కంటెస్టెంట్స్ కారు అద్దాలను పగలగొట్టి దాడి చేశారు. ఘర్షణలో అటు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు అద్దాలను కూడా ద్వంసం చేశారు. ఈ ఘటనకు సంబంధించి జూబ్లీహిల్స్ పోలీసులు విన్నర్ పల్లవి ప్రశాంత్ పై సుమోటోగా కేసు బుక్ చేశారు. సెక్షన్ 147, 148, 290, 353, 149, 427 రెడ్ విత్ సెక్షన్ల కింద పోలీసులు FIR నమోదు చేశారు. అంతే కాదు ఈ ఘటనకు కారణమైన కొంత మంది అభిమానుల పై కేసు పెట్టినట్లు తెలుస్తోంది.
కార్లను అడ్డుకొని దాడి చేయడం పై ఇప్పటికే కొందరు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ సీరియస్ అయ్యారు. అశ్విని, గీతు తమ కారు అద్దాలు పగలగొట్టడం పై స్పందించారు. అభిమానం ఉండడం ఒకే.. కానీ ఇలా ఇతరులను హర్ట్ చేయడం సరైనది కాదని సీరియస్ అయ్యారు. తాజాగా ఈ ఘటన సంబంధించి టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కూడా ట్వీట్ చేశారు. బస్సుల ధ్వంశం పై ఆర్టీసీ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. "ప్రజలను వారి గమ్య స్థానాలకు సురక్షితంగా చేర్చే బస్సుల పై దాడి చేస్తే.. సమాజం పై దాడి చేసినట్టే అంటూ సీరియస్ అయ్యారు". ఆర్టీసీ బస్సులు ప్రజల ఆస్తి వాటిని కాపాడాల్సిన బాధ్యత అందరిదీ అని తెలిపారు. ఇలాంటి ఘటనలు ఆర్టీసీ యాజమాన్యం ఏ మాత్రం సహించబడదని ట్వీట్ చేశారు.