ఐదేళ్లుగా జకోవిచ్‌దే హవా.. ఫెదరర్ వయసురిత్యా..నాదల్ గాయల బెడదతో ఒక్కసారిగా వాళ్లిద్దరిని బీట్ చేస్తూ టెన్నిస్ ప్రపంచంలో మేటి ఆటగాడిగా నిలిచిన జకోవిచ్‌కి వింబుల్డెన్ ఫైనల్లో బ్రేక్ పడింది. ఇప్పటికే 23సార్లు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలిచిన జకో జోరుగా కొత్త కింగ్..నయా స్పెయిన్ బుల్ కార్లోస్ అల్కరాస్. జకోను నిజంగా జోకర్ చేస్తూ వింబుల్డెన్ ట్రోఫిని ఎగరేసుకుపోయాడు. బీపీతో రాకెట్ నెలకేసి బాదడం తప్ప జకో ఏమీ చేయాలేని పరిస్థితి. 2018నుంచి వరుసగా వింబుల్డెన్ టైటిల్ గెలుస్తూ వస్తున్న జకోకి అల్కరాస్ అడ్డుకట్ట వేశాడు. సెంట్రల్ కోర్టులో గత పదేళ్లలో ఓటమే ఎరుగని వీరుడిని స్పెయిన్ సంచలనం బోల్తా కొట్టించాడు. 2002 తర్వాత ఫెదరర్, నాదల్, జకో, ముర్రే కాకుండా తొలిసారి వింబుల్డెన్ గెలిచిన నాన్ ‘బిగ్-4’ ప్లేయర్‌గా నిలిచాడు.
పూర్తిగా చదవండి..Wimbledon: 21ఏళ్ల రికార్డు బద్దలు.. టెన్నిస్ నయా కింగ్ అల్కరాస్..!
ప్రతిష్టాత్మకమైన వింబుల్డన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్‌లో కార్లోస్ అల్కరాస్ సంచలన విజయం సాధించాడు. టైటిల్ పోరులో నోవాక్ జకోవిచ్‌పై ఈ స్పెయిన్ ఆటగాడు 1-6, 7-6, 6-1, 3-6, 6-4తో గెలిచాడు.
Translate this News: