Wimbledon: 21ఏళ్ల రికార్డు బద్దలు.. టెన్నిస్‌ నయా కింగ్‌ అల్కరాస్..!

ప్రతిష్టాత్మకమైన వింబుల్డన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్‌లో కార్లోస్ అల్కరాస్ సంచలన విజయం సాధించాడు. టైటిల్ పోరులో నోవాక్ జకోవిచ్‌పై ఈ స్పెయిన్ ఆటగాడు 1-6, 7-6, 6-1, 3-6, 6-4తో గెలిచాడు.

New Update
Wimbledon: 21ఏళ్ల రికార్డు బద్దలు.. టెన్నిస్‌ నయా కింగ్‌ అల్కరాస్..!

ఐదేళ్లుగా జకోవిచ్‌దే హవా.. ఫెదరర్‌ వయసురిత్యా..నాదల్‌ గాయల బెడదతో ఒక్కసారిగా వాళ్లిద్దరిని బీట్‌ చేస్తూ టెన్నిస్‌ ప్రపంచంలో మేటి ఆటగాడిగా నిలిచిన జకోవిచ్‌కి వింబుల్డెన్ ఫైనల్‌లో బ్రేక్‌ పడింది. ఇప్పటికే 23సార్లు గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు గెలిచిన జకో జోరుగా కొత్త కింగ్‌..నయా స్పెయిన్‌ బుల్‌ కార్లోస్ అల్కరాస్‌. జకోను నిజంగా జోకర్ చేస్తూ వింబుల్డెన్‌ ట్రోఫిని ఎగరేసుకుపోయాడు. బీపీతో రాకెట్‌ నెలకేసి బాదడం తప్ప జకో ఏమీ చేయాలేని పరిస్థితి. 2018నుంచి వరుసగా వింబుల్డెన్ టైటిల్‌ గెలుస్తూ వస్తున్న జకోకి అల్కరాస్‌ అడ్డుకట్ట వేశాడు. సెంట్రల్‌ కోర్టులో గత పదేళ్లలో ఓటమే ఎరుగని వీరుడిని స్పెయిన్‌ సంచలనం బోల్తా కొట్టించాడు. 2002 తర్వాత ఫెదరర్‌, నాదల్‌, జకో, ముర్రే కాకుండా తొలిసారి వింబుల్డెన్‌ గెలిచిన నాన్‌ 'బిగ్‌-4' ప్లేయర్‌గా నిలిచాడు.

నాలుగున్నర గంటలపాటు నువ్వానేనా:
ప్రతిష్టాత్మకమైన వింబుల్డన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్‌లో కార్లోస్ అల్కరాస్ సంచలన విజయం సాధించి, తొలి వింబుల్డన్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. సెంట్రల్ కోర్టు వేదికగా జరిగిన టైటిల్ పోరులో టాప్ సీడెడ్ ఆటగాళ్లు కార్లోస్ అల్కరాస్‌(మొదటి ర్యాంకు), నోవాక్ జకోవిచ్(రెండో ర్యాంకు) నువ్వా నేనా అన్నట్లుగా పోరాడారు. నాలుగున్నర గంటలపాటుగా సాగిన ఈ పోరులో స్పెయిన్ ఆటగాడు అల్కరాజ్‌ 1-6, 7-6, 6-1, 3-6, 6-4తో సెర్బియా స్టార్‌ జకోను మట్టికరిపించాడు. తొలిసెట్‌ను అలవోకగా కోల్పోయిన అల్కరాస్ రెండో సెట్ ప్రతిఘటించి 76తో సొంతం చేసుకున్నాడు. తర్వాత మూడో సెట్‌ను అలవోకగా కైవసం చేసుకున్నా నాలుగో సెట్‌లో 3-6తో ఓడిపోయాడు. నిర్ణయాత్మక ఐదో సెట్‌లో చెమట్టోడ్చి 6-4తో సెట్ కైవసం చేసుకొని గేమ్ ముగించాడు.

ఇప్పుడే మొదలైంది:
అల్కరాస్‌కి ఇది వింబుల్డన్ తొలి టైటిల్. ఓవరాల్‌గా అతనికిది రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్. గతేడాది యూఎస్‌ ఓపెన్ టైటిల్ గెలిచిన తర్వాత గాయాలతో గేమ్‌కి కొన్నాళ్లు దూరంగా ఉన్న అల్కరాస్‌ తర్వాత ఫ్రెంచ్‌ ఓపెన్‌లో ఆడినా సెమీస్‌లో జకో చేతిలో ఓడిపోయాడు. అప్పటి ఓటమికి ఇప్పుడు వింబుల్డెన్‌ ఫైనల్‌లో స్వీట్ రివెంజ్‌ తీర్చుకున్నాడు అల్కరాస్‌. 24వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ గెలుస్తాడని భావించిన జకో ఫైనల్‌లో ఓడిపోవడంతో ఎప్పటిలాగే అసహనానికి గురయ్యాడు. నిజానికి ఫెదరాద్‌, నాదల్‌ కంటే లేటుగా ప్రపంచ టెన్నిస్‌ని డామినేట్‌ చేసినా వాళ్లిద్దరి కంటే ఓ మెట్టు పైనే ఉన్న జకోకి ఈ ఓటమి చాలా బాధపెట్టింది. ఎందుకంటే ఇలాంటి ఓటములే తర్వాత విన్నింగ్‌ జోరుగా అడ్డుగోడగా మిగిలిపోతాయని చరిత్ర చెబుతోంది. పీట్ సంప్రాస్‌ విషయంలోనూ అదే జరిగింది. 2001లో నాటి టీనెజర్‌గా ఉన్న ఫెదరర్‌ అద్భుతం సృష్టించాడు. వరుసగా ఐదోసారి వింబుల్డెన్‌ గెలవాలని చూసిన పీట్ సంప్రాస్‌ని ఓడించాడు. అక్కడితో మొదలైన ఫెదరర్‌ హవా..అతని రిటైర్మెంట్‌ ముందువరకు కొనసాగింది. ఇప్పుడు అల్కరాస్‌ కూడా ప్రపంచ టెన్నిస్‌ని డామినెట్‌ చేస్తాడని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు