How To Get Success In Career : చాలామంది కెరీర్(Career) లో ఎదగడానికి టాలెంట్ ఒక్కటి ఉంటే సరిపోతుందని అనుకుంటారు. ఇది ఏ మాత్రం కరెక్ట్ కాదు. టాలెంట్‌తో పాటు ఇంకా చాలా పెరామీటర్స్ మీ కెరీర్‌కి కొలమానంగా నిలుస్తాయి. అందులో అన్నిటికంటే ప్రధానమైనది సమయపాలన(Punctuality). టైమ్‌కి తినడం, నిద్రపోవడం ఎంత ముఖ్యమో.. టైమ్‌కి ఆఫీస్‌కి రావడం కూడా అంతే ముఖ్యం. ఈ సమయానికి రావడం అన్నది చిన్నతనం నుంచే అలవాటు కావాలి. ఆఫీస్‌లో బాస్ తిడుతాడనో.. లేదో శాలరీ కట్ అవుతుందనో కాకుండా.. టైమ్‌కి రావడం అన్నది మనకు మనంగా అలవాటు చేసుకోవాల్సిన విషయం. ఇలా టైమ్‌కి రావడం వల్ల మీ వర్క్ ప్రొడక్టవిటీ కూడా పెరుగుతుంది. సమయపాలన వల్ల మీ కెరీర్‌కు ఎలా ప్లస్ అవుతుందో ఇక్కడ తెలుసుకోండి.
• సమయానికి ఆఫీస్‌కి వచ్చేవాళ్లు ఆర్గనైజెడ్‌గా ఉన్నట్టు లెక్క. ఒక వేళ మీరు ఆర్గనైజెడ్‌గా లేకపోతే అది మీకు వర్క్‌ప్లేస్‌లో బ్యాడ్ నేమ్‌ని తీసుకొస్తుంది. ఎంత టాలెంట్ ఉన్నా టైమ్‌కి రావడం అన్నది ముఖ్యం. లేకపోతే టాలెంట్ ఉంది కదా.. అందుకనే ఇష్టం వచ్చిన టైమ్‌కి ఆఫీస్‌కి వస్తున్నారని.. టెకెన్ ఫర్ గ్రాంటెడ్(Taken For Granted) లాగా ప్రవర్తిస్తున్నారని కంపెనీ అనుకునే ప్రమాదం ఉంది.
• షెడ్యూల్ కంటే ముందుగా చేరుకోవడం జాబ్ స్కిల్(Job Skill) తో పాటు మీ ఉద్యోగం పట్ల నిబద్ధతను ప్రదర్శిస్తుంది.
• సమయపాలన పాటించడం మీ సహోద్యోగులకు మీ పట్ల గౌరవాన్ని చూపుతుంది. ఎందుకంటే అది వారి సమయానికి విలువనిస్తుంది. టైమ్ సెన్స్ లేకుండా ఉండడం వారిని పరోక్షంగా అగౌర పరిచినట్టే అవుతుంది.
• అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే అదే పనిగా లేట్‌గా రావడం వల్ల మీకు ప్రాజెక్టులు ఇవ్వడానికి కంపెనీ ఇష్టపడదు. మీ కోలిగ్స్ వర్క్ షేర్ చేసుకోరు. ఇది మీ కెరీర్‌పై చాలా నెగిటివ్ ఎఫెక్ట్ చూపుతుంది. లేట్‌గా వచ్చేవారికి ఎవరూ వర్క్ ఇవ్వాలని అనుకోరు.. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి.
• సమయానుకూలంగా రావడం మీ పనిని వెంటనే ప్రారంభించేలా చేస్తుంది. ఇది మీ వర్క్ ప్రొడక్టవిటిని పెంచుతుంది.
• సమయపాలన పాటించడం మీ కంపెనీ నుంచి మీకు మంచి పేరు తెచ్చిపెట్టడంలో సహాయపడుతుంది
• సమయపాలన పాటించే వ్యక్తిని ఇతర జాబ్స్ వెతుక్కుంటూ వస్తాయి. అప్పుడు మీరు కెరీర్‌లో పురోగతి సాధించవచ్చు.
• ప్రస్తుత కాలంలో టీమ్‌వర్క్(Team Work) అన్నది అన్నిటికంటే ముఖ్యమైనది. మీరు అదే పనిగా లేట్‌గా వస్తుంటే మిమ్మల్ని కనీసం టీమ్ మెంబర్‌గా కూడా కన్సిడర్ చేయరు. మీ వల్ల కోలిగ్స్‌పై ఒత్తిడి పెరుగుతుంది.
Also Read : మనసులను లాక్ చేసే లిప్స్.. అందాల అధరాల కోసం ఈ టిప్స్ ఫాలో అవ్వండి!