Skin Tips: యాలకులతో ఇలా చేశారంటే ముఖంపై మచ్చలు మాయం

యాలకులు ఇంట్లో వంటలు, స్వీట్స్‌లో వీటిని వాడుతుంటాం. యాలకులతో చర్మ సౌందర్యాన్ని కూడా మెరుగుపర్చుకోవచ్చని నిపుణులు అంటున్నారు. యాలకులతో మొటిమలు, మచ్చలను తొలగించవచ్చు. యాలకుల పొడిలో పెరుగు కలిపి పేస్ట్‌ని ముఖానికి ఎలాంటి పట్టించుకోవాలో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్‌లోకి వెళ్లండి.

Skin Tips: యాలకులతో ఇలా చేశారంటే ముఖంపై మచ్చలు మాయం
New Update

Skin Tips: యాలకులు పురాతన కాలం నుంచి మన ఇంట్లో వంటలు, స్వీట్స్‌లో వీటిని వాడుతుంటాం. కొందరు టీలో కూడా వేసుకుంటారు. అయితే యాలకులతో చర్మ సౌందర్యాన్ని కూడా మెరుగుపర్చుకోవచ్చని నిపుణులు అంటున్నారు. యాలకులతో మొటిమలు, మచ్చలను తొలగించవచ్చు. దీని కోసం 2 నుంచి 3 యాలకులను మెత్తగా పొడి చేయాలి. ఈ పౌడర్‌లో ఒక చెంచా తేనె, కొంచెం పాలు కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి పట్టించి 20 నిమిషాల పాటు ఉంచి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

publive-image

ఇలా వారానికి రెండు మూడు సార్లు చేస్తే ఫలితం ఉంటుంది. చెంచా యాలకుల పొడిలో పెరుగు కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగాలి. 2 యాలకులు పౌడర్‌గా చేసి అందులో శెనగపిండి, కొంచెం నీరు వేసి పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్‌ను ముఖంపై 20 నిమిషాల పాటు అప్లై చేయండి. తర్వాత చల్లటి నీటితో కడిగివేయాలి. ఇలా వారానికి రెండు, మూడు సార్లు చేయాలి.

publive-image

2 నుంచి 3 యాలకులను నీటిలో వేసి మరిగించి చల్లార్చి దానితో ముఖం కడుక్కోవాలి. ఈ నీటిని స్ప్రే బాటిల్‌లో కూడా నింపవచ్చు. అలాగే ఆహారంలో కూడా యాలకులు ఎక్కువగా తీసుకుంటే చర్మం ఆరోగ్యం మెరుగుపడుతుందని, యాలకులను మసాలా టీగా చేరసుకుని తాగినా మంచిదే అని నిపుణులు అంటున్నారు. కొందరికి యాలకులు వాడితే ఎలర్జీ రావచ్చు. ముఖంపై ఏదైనా సమస్య ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: ఇంతటితో జగన్‌పై దాడులు ఆగవు.. ఏ క్షణమైనా ఆయన ప్రాణానికి ప్రమాదం: ఎమ్మెల్యే రాచమల్లు

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

#skin-tips
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe