/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/car-1-1.jpg)
Vikarabad: రుతుపవనాల రాకతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వికారాబాద్ జిల్లాలోనూ కుండపోత వర్షం కురుస్తోంది. భారీ వర్షంతో నాగవరంలోని వాగు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో వాగులో ఓ కారు కొట్టుకుపోయింది. అయితే, కారులో ప్రయాణిస్తున్న నలుగురు సురక్షితంగా బయటపడ్డారు. వెంటనే అప్రమత్తమైన పోలుసులు ఘటనాస్థలికి చేరుకుని బాధితులతో మాట్లాడారు. వాగుల దగ్గర అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.