స్టీరింగ్‌ పైకి పాము, పంటపొలాల్లోకి కారు, తప్పిన పెను ప్రమాదం

డా. బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం గాడిలంక గ్రామం వద్ధ గల జాతీయ రహదారిపై అదుపుతప్పి ఒక్కసారిగా పక్కనున్న పంట పొలాల్లోకి కారు దూసుకుపోయింది. అయితే అందులోని కుటుంబమంతా సురక్షితంగా ఉన్నారు. కారులోని ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అక్కడికి చేరుకున్న స్ధానికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే దీనంతటికి ఓ పాము కారణమని తెలుస్తోంది.

స్టీరింగ్‌ పైకి పాము, పంటపొలాల్లోకి కారు, తప్పిన పెను ప్రమాదం
New Update

ఇక అసలు వివరాల్లోకి వెళితే.. యానాం నుండి కొత్తలంక వలీ బాబా దర్గాకు దర్శనం కోసం వెళ్తున్న క్రమంలో కారు అదుపుతప్పి పక్కనున్న పంటపొలాల్లోకి దూసుకెళ్లింది. అయితే కారులో ప్రయాణిస్తున్న కుటుంబసభ్యులు క్షేమంగా ఉన్నారు. అంతేకాదు... ఇందులో ఇంకో అసలు ట్విస్ట్ ఉంది. అసలు కారు ప్రమాదానికి గురవడానికి మెయిన్‌ రీజన్‌ పాము స్టీరింగ్ పైకి రావడేమనట...హఠాత్తుగా కారు స్టీరింగ్ పైకి పాము రావడంతో భయపడి కారు స్టీరింగ్ వదిలేయడంతోనే కారు అదుపుతప్పిందని డ్రైవర్ చెప్పుకొచ్చాడు.

అసలు ఈ పాము అందులోకి ఎలా వచ్చిందనే దానిపై కుటుంబసభ్యులందరూ భయాందోళనకు గురవుతున్నారు. ఎలాంటి ప్రమాదం జరగలేదు కాబట్టి సరిపోయింది. లేకుంటే చాలా ప్రమాదం జరిగి అందులోని ప్రయాణికులంతా ఏమై పోయేవాళ్లమని అంతేకాదు డ్రైవర్‌ చాకచక్యంగా వ్యవహరించడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదని.. అదే కారు వేగం ఎక్కువగా ఉండుంటే మాత్రం కారు నాలుగు పల్టీలు కొట్టేదని స్ధానికులు చెప్పుకొచ్చారు. జరగరానిది ఏదైనా జరిగుంటే మన పరిస్థితి ఏంటంటూ కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. అయితే స్ధానికులు అక్కడికి చేరుకొని ట్రాక్టర్ సాయంతో పంటపొలాల్లో ఇరుక్కున్న కారును బయటకు తీశారు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe