పండుగల సీజన్ ముందు ఊపందుకున్న కార్ల అమ్మకాలు.. ఏ కార్లు ఎలా సేల్ అవుతున్నాయంటే..!!

వచ్చేదంతా పండగల సీజన్. ఈ నేపథ్యంలో కార్ల అమ్మకాలు జోరందకున్నాయి. జూలై నెలలో కార్ల విక్రయాలు భారీగా జరిగాయి. దిగ్గజాలు మారుతీ, సుజుకీ, టాటా మోటార్స్, ఎంఅండ్ఎం, టీకేఎం, కియా ఇండియా ఇలా జూలైలో పటిష్ట విక్రయాలను సాధించాయి. కార్లు మాత్రమే కాదు ద్విచక్రవాహనాల కొనుగోలు కూడా భారీగానే పెరిగాయి.

New Update
Telangana: కొత్త వెహికిల్ కొనేవారికి రేవంత్ సర్కార్ అదిరిపోయే శుభవార్త.. ఇక షోరూంలోనే రిజిస్ట్రేషన్లు!

జూలై నెలలో కార్ల అమ్మకాలు జోరందుకున్నాయి. దిగ్గజ కంపెనీలకు చెందిన కార్లన్నీ పటిష్ట విక్రయాలను సాధించాయి. కార్లు మాత్రమే కాదు ద్విచక్రవాహనాలు కూడా భారీగా అమ్ముడుపోయాయి. ద్విచక్రవాహనాల్లో అగ్రశ్రేణి కంపెనీలు అయిన హీరోమోటో, హెచ్ఎంఎస్ఐల వాల్యూమ్ లలో క్షీణత ఉన్నప్పటికీ మిశ్రమ ఫలితాలను పొందాయి. జూలైలో కంపెనీలు విడుదల చేసిన అమ్మకాల సంఖ్య ప్రకారం..మారుతి సుజుకి 6.5శాతం వృద్ధితో 1.5 లక్షల యూనిట్లను విక్రయించింది.

రెండు వారాల క్రితం విడుదలైన హ్యుందాయ్ కారు మార్కెట్లో మంచి సేల్ అవుతుంది. ప్రస్తుతం దేశీయ విక్రయాలు 50,000 యూనిట్ల మార్క్ ను దాటాయి. అయితే వాల్యూమ్‌లు దాదాపు ఫ్లాట్‌గా ఉన్నాయి. ఈ నెలలో 47,628 యూనిట్లను విక్రయించిన టాటా మోటార్స్‌కు కూడా ఈ సంఖ్యలు ఫ్లాట్‌గా ఉన్నాయి. అయితే, మహీంద్రా & మహీంద్రా, టయోటా కిర్లోస్కర్, MG మోటార్స్ వంటి కంపెనీలకు జూలై మంచి విక్రయాలను సాధించాయి. XUV700, స్కార్పియో-N లాంచ్ తర్వాత మహీంద్రా అధిక స్థాయిలో దూసుకెళ్లింది. దాదాపు 29% అమ్మకాల వృద్ధిని సాధించింది.

ఈ బాటలో టయోటా మోటార్స్ అమ్మకాలు సైతం పుంజుకున్నాయి. జూలైలో 21,911 యూనిట్లను విక్రయించింది. టయోటా కిర్లోస్కర్ మోటార్ అమ్మకాలు 175శాతం పెరిగి 12,835 యూనిట్లు తాగాయి. "మిడ్-ఇయర్ సేల్స్ ట్రెండ్ దృష్ట్యా, థర్డ్ షిఫ్ట్ ఆపరేషన్‌ని జోడించడం ద్వారా ఉత్పత్తిలో మా పెరుగుదలతో పాటు, మా బలమైన సంవత్సరాల్లో ఒకదానిని నమోదు చేయగలమని విశ్వసిస్తున్నాము అంటూ టయోటా ఇండియా VP విక్రయాల అతుల్ సూద్ అన్నారు. MG మోటార్స్ జూలైలో 5,012 యూనిట్ల రిటైల్ విక్రయాలను కలిగి ఉందని, అంతకుముందు సంవత్సరం ఇదే నెలలో 4,013 యూనిట్ల కంటే 25% వృద్ధిని సాధించిందని తెలిపారు. ఇక అటు కియా ఇండియా కారు అమ్మకాలు జోరందుకున్నాయి. 48శాతం మెరుగుపడి 28,634 యూనిట్లుకు చేరుకుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు