J&K: విహార యాత్రలో విషాదం.. కారు లోయలో పడి...

విహారయాత్ర కోసం కేరళ నుంచి కశ్మీర్ వచ్చిన పర్యాటకులు ప్రయాణిస్తున్న కారు లోయలో పడిపోవడంతో ఏడుగురు పర్యాటకులు మృత్యువాత పడ్డారు. శ్రీనగర్ - లెహ్ జాతీయ రహదారిపై మంగళవారం ఈ ప్రమాదం జరిగింది.

J&K: విహార యాత్రలో విషాదం.. కారు లోయలో పడి...
New Update

Srinagar: జమ్మూకశ్మీర్‌ (Jammu&Kashmir) లో ఘోరం జరిగింది. గతనెలలో దోడా సమీపంలో జరిగిన విషాదాన్ని మరువకముందే మరో ప్రమాదం చోటుచేసుకుంది. విహారయాత్ర కోసం కేరళ నుంచి వచ్చిన పర్యాటకులు ప్రయాణిస్తున్న కారు లోయలో పడిపోవడంతో వారంతా మృత్యువాత పడ్డారు. దీంతో ఆ ప్రాంతంలో విషాధ ఛాయలు నెలకొన్నాయి.

ఇది కూడా చదవండి: కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్‌‌ ను కాల్చి చంపిన దుండగులు

గాందర్‌బల్ జిల్లాలో శ్రీనగర్ - లెహ్ జాతీయ రహదారిపై మంగళవారం ఈ ప్రమాదం జరిగింది. రోడ్డుమీద మంచు దట్టంగా పేరుకుపోయి ఉండడంతో కారు జారి లోయలో పడిపోయింది. జోజిలా కనుమ వద్ద జరిగిన ఈ దుర్ఘటనలో ఏడుగురు పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. సోనామార్గ్ పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

ప్రమాద సమయంలో కారులో ఏడుగురు పర్యాటకులతో పాటు డ్రైవర్‌ ఉన్నారు. రోడ్డుపై మంచు చాలా దట్టంగా ఉండడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. మృతులంతా కేరళ రాష్ట్రానికి చెందిన వారని తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన కారు డ్రైవర్‌ను స్కిమ్స్‌కు తరలించి చికిత్స అందించారు. గత నెలలోనూ దోడా సమీపంలో బస్సు లోయలో పడి 36 మంది మృత్యువాత పడ్డారు.

#crime-news #accident-in-jammu-and-kashmir
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe