క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టలేదని టెన్షన్ పడకండి..ఇలా చేసి సులభతరం చేసుకోండి.. ఈ రోజుల్లో క్రెడిట్ కార్డ్ వాడని వారు ఉంటారా..గ్రామీణా ప్రాంతాల నుంచి సిటీల వరకు క్రెడిట్ కార్డు వినియోగం ఆవరించింది.అయితే చాలా మంది సకాలంలో క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే అలాంటి వారి కోసమే ఈ స్టోరీ కావాలంటే చూసేయండి.. By Durga Rao 20 May 2024 in లైఫ్ స్టైల్ నేషనల్ New Update షేర్ చేయండి ఒక వస్తువు కొనుగోలు చేసే ఆప్షన్, కొన్ని రోజులకు పూర్తిగా లేదా వాయిదాలలో తిరిగి చెల్లించే సదుపాయం ఉండటంతో క్రెడిట్ కార్డ్‌లు బాగా పాపులర్ అయ్యాయి. అయితే చాలామంది క్రెడిట్ కార్డులను ఎడాపెడా వాడేస్తున్నారు. దీనివల్ల వారి సంపాదన పెరగట్లేదు కానీ ఖర్చులు మాత్రం ఆదాయం రేంజ్‌ను మించిపోతున్నాయి. గడువులోగా ఆ బిల్లులను కట్టలేక వడ్డీభారం పెరిగిపోతుందని ఒత్తిడికి లోనవుతున్నారు.చివరికి క్రెడిట్ కార్డుల బిల్లులు చూసుకొని లబోదిబోమనే పరిస్థితి ఎదురవుతోంది. అయితే క్రెడిట్ కార్డు బిల్లులను సకాలంలో చెల్లించలేని పరిస్థితే వస్తే ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాటిని మీరు ఈఎంఐ రూపంలోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. లేదంటే కస్టమర్ కేర్‌లో సంప్రదించి ఆ మొత్తాన్ని పర్సనల్ లోన్‌గా మార్చుకోవచ్చు. మరో ప్రత్యామ్నాయం కూడా ఉంది. వేరే క్రెడిట్ కార్డుకు ఆ అప్పుని బదిలీ చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డుకు సంబంధించిన మొత్తం బకాయిని కూడగట్టి వ్యక్తిగత రుణంగా మారిస్తే చాలావరకు టెన్షన్ తగ్గుతుంది. ఇలా మనకు ఏర్పడిన లోన్‌ను ప్రతినెలా ఈఎంఐ రూపంలో కట్టేయొచ్చు. క్రెడిట్ కార్డు బిల్లును మనం కట్టకుంటే క్రెడిట్ స్కోరు పడిపోతుంది. క్రెడిట్ వినియోగ నిష్పత్తి సైతం పెరుగుతుంది. దీనికి బదులుగా లోన్‌తో ఒకేసారి బాకీ తీరిస్తే, క్రెడిట్ స్కోరు మెరుగు అవుతుంది. గడువులోగా క్రెడిట్ కార్డు బిల్లును కట్టకపోతే భారీగా రుసుముల భారాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. లోన్‌ను తిరిగి కట్టేస్తే ఈ బాధ ఉండదు. క్రెడిట్ కార్డు బిల్లును కట్టేందుకు మీరు ప్రత్యేకంగా పర్సనల్ లోన్‌ను బ్యాంకు నుంచి తీసుకోవచ్చు. కొన్ని బ్యాంకులు 12 నుంచి 84 నెలల వరకు వ్యవధితో లోన్లు ఇస్తుంటాయి #credit-cards #credit-card-bill మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి